పాకిస్థాన్ లో భూకంపం.. ఇస్లామాబాద్, రావల్పిండిలో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

Published : Dec 22, 2023, 11:52 AM IST
 పాకిస్థాన్ లో భూకంపం.. ఇస్లామాబాద్, రావల్పిండిలో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

సారాంశం

ఇప్పటికే వరస భూకంపాలతో అతలాకుతలమైన పాకిస్థాన్ ( earthquake in pakisthan)లో మరో సారి ప్రకంపనలు సంభవించాయి.  ఇస్లామాబాద్, రావల్పిండి (Islamabad, Rawalpindi) పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున ఒక్క సారిగా భూకంపం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

Pakistan earthquake : పాకిస్థాన్ లో మళ్లీ భూకంపం సంభవించింది.  ఇస్లామాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క సారిగా ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల ప్రభావంతో ఇస్లామాబాద్, రావల్పిండి, పరిసర ప్రాంతాలను వణికిపోయాయని ‘ఏఆర్ వై’ న్యూస్ తెలిపింది.

ఇస్లామాబాద్, రావల్పిండి, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 5.30 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు భూకంప కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రత 16 కిలోమీటర్లుగా నమోదైందని పేర్కొంది. భూ ప్రకంపనలకు భయపడిన స్థానికులు కల్మా-ఎ-తయ్యాబా జపం చేస్తూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

అయితే ఈ ప్రకంపనల వల్ల ఇస్లామాబాద్, రావల్పిండిలోని ఈ ప్రాంతంలోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదు. కాగా.. గత నెలలో కూడా గిల్గిత్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత నమోదైనప్పటికీ.. ఒక్క సారిగా ఆ ప్రాంతాన్ని ప్రకంపనలు కుదిపేశాయి. గిల్గిత్, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ (ఎన్ఎస్ఎంసీ) పేర్కొంది. 45 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం, వాయవ్య ప్రాంతంలో 84 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఆ సమయంలో ఎన్ఎస్ఎంసీ ఇస్లామాబాద్ ప్రకటించింది. 

అలాగే అక్టోబర్ నెలలో కూడా పాకిస్థాన్ లో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో స్వల్ప భూకంపం సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది.  కరాచీలోని ఖైదాబాద్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ ఇస్లామాబాద్ ఆ సమయంలో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?