జపాన్ లో మళ్లీ భూకంపం.. హోన్షు వెస్ట్ కోస్ట్ లో కంపించిన భూమి..

By Sairam Indur  |  First Published Jan 7, 2024, 3:28 PM IST

japan earthquake : జపాన్ లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇప్పటికే వరుస భూ ప్రకంపనలతో దెబ్బతిన్న ఆ దేశాన్ని తాజా భూకంపం మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు.


japan earthquake : జపాన్ ను భూకంపాలు వదలడం లేదు. ఇప్పటికే వరుస భూకంపాలతో అతలాకుతలమైన ఆ దేశంలో మరో సారి భూ ప్రకంపనలు వచ్చాయి. తాజాగా ఆదివారం ఉదయం హోన్షు వెస్ట్ కోస్ట్ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని జీఎఫ్జెడ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అధికారికంగా వెల్లడించింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన ఘనత.. కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్, సక్సెస్‌ఫుల్‌గా దిగిన సీ 130జే

Latest Videos

undefined

37.36 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 137.52 డిగ్రీల తూర్పు రేఖాంశంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఆ సంస్థ తెలిపింది. దీని లోతు 10.0 కిలో మీటర్లు గా ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొదటి రోజునే జపాన్ లో భూకంపం సంభవించింది. మళ్లీ రెండో రోజు కూడా 150కి పైగా భూప్రకంపనలు వచ్చాయి. వీటి వల్ల నిగటా, టోయామా, ఫుకుయి, గిఫు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, కార్యాలయాలు, మాల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఈ ప్రకంపనల వల్ల జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. దాదాపు 45 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ భూకంప వల్ల సంభవించిన నష్టంపై ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని కాలానికి వ్యతిరేకంగా పోరాటం"గా అభివర్ణించారు.

ఇక ముందూ నా బాధ్యత ఇలాగే నిర్వర్తిస్తా - నెల రోజుల పాలనపై రేవంత్ రెడ్డి

ఈ భూకంపాలపై తాజాగా ఆ దేశ ప్రధాని మాట్లాడుతూ.. నూతన సంవత్సరం రోజున సంభవించిన భూకంపం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సహాయక చర్యలకు మంచు తుఫాను ఆటంకం కలిగించిందని అన్నారు. 
పునర్నిర్మాణ ప్రయత్నాల కోసం తమ ప్రభుత్వం 4.74 బిలియన్ యెన్ల (32.77 మిలియన్ డాలర్లు) బడ్జెట్ నిల్వలను ఉపయోగించుకుంటుందని కిషిడా గత శుక్రవారం తెలిపారు. 

click me!