వ్యాక్సిన్‌ తీసుకునేందుకు జంకుతున్న జనం.. రెస్టారెంట్ల ఆఫర్లు

By Siva KodatiFirst Published Jan 26, 2021, 2:55 PM IST
Highlights

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని జనం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. తీరా టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని తీసుకోవడానికి జంకుతున్నారు

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని జనం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. తీరా టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని తీసుకోవడానికి జంకుతున్నారు.

ఎందరో దేశాధినేతలు, ప్రముఖులు వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో వున్న భయాందోళనలను తొలగించడానికి పబ్లిక్‌గా డోసు తీసుకున్నారు. కానీ ఇంకా జనం మారడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేయించుకున్న కస్టమర్లకు డిన్నర్లపై డిస్కౌంట్‌ ఇస్తామని దుబాయ్‌ రెస్టారెంట్లు ప్రకటిస్తున్నాయి.

ఇప్పటివరకు యూఏఈలో 25 లక్షల మందికి టీకా వేశారు. అయితే దేశ జనాభా మొత్తం కోటి . ప్రజల్లో టీకాపై మరింతగా అవగాహన పెంచేందుకు తమ వంతు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్లు ఇలా వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చాయి. ‘ప్రేమను పంచు, దుఃఖాన్ని కాదు’ అంటూ ఓ హోటల్‌ తన ఎంట్రీ పాయింట్ వద్ద బ్యానర్ పెట్టింది. 

అదే విధంగా.. టీకా తొలి డోసు తీసుక్ను కస్టమర్లకు 10 శాతం, రెండు డోసులు తీసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించింది. డిస్కౌంట్‌ కావాలనుకునే వాళ్లు టీకా తీసుకున్న ఆధారాలు చూపాలి.

ఈ ఆఫర్‌పై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఎక్కువ మంది దీనిని మెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. దీనిని బిజినెస్ పెంచుకునే ట్రిక్‌గా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో చైనా సినోఫామ్‌, ఫైజర్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. 

click me!