30 నిమిషాల్లో 33 ఫ్లోర్లు.. ఫ్రెంచ్ సైక్లిస్ట్ కొత్త రికార్డ్.. వీడియో వైరల్..

Published : Jan 26, 2021, 02:53 PM IST
30 నిమిషాల్లో 33 ఫ్లోర్లు.. ఫ్రెంచ్ సైక్లిస్ట్ కొత్త రికార్డ్.. వీడియో వైరల్..

సారాంశం

అపార్ట్‌మెంట్లలో, ఆఫీసుల్లో లిఫ్ట్ పనిచేయకపోతే రెండు, మూడు ఫ్లోర్లు ఎక్కడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు. మధ్య మధ్యలో ఆగుతూ, దమ్ము తీసుకుంటూ ఏదో కానిచ్చేస్తారు. కానీ.. ఫ్రాన్స్‌కు చెందిన  ఆరీలియన్ అనే సైక్లిస్ట్ అలా కాదు. ఈ మౌంటైన్ బైకర్ తన సైకిల్‌పై ఏకంగా 33 ఫ్లోర్లు ఎక్కేశాడు. 

ఇంకా విశేషమేంటంటే.. 33 ఫ్లోర్లు ఎక్కేంత వరకు ఆరీలియన్ కాళ్లు కింద కూడా పెట్టలేదు. పోటో అనే ప్రాంతంలో ఉన్న ట్రినిటీ టవర్‌లో ఉన్న 33 ఫ్లోర్ల పైకి ఆరీలియన్ సైకిల్‌‌పై వెళ్లాడు. మొత్తంగా 768 మెట్లు ఎక్కాడు. 

అనంతరం కాళ్లు కింద పెట్టేయడంతో అక్కడితో ఆపేసి తన సైకిల్‌ను భూజాలపై పెట్టుకుని కిందకు వచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. తాము లిఫ్ట్ లేకుండా 30 ఫ్లోర్లు మెట్లు ఎక్కమంటేనే భయపడతామని, అలీరియన్ ఏకంగా సైకిల్‌పై వెళ్లడం నిజంగా రికార్డ్ అనే చెప్పాలంటూ కొనియాడుతున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ టు థాయిలాండ్ విమానానికి ప్రమాదం.. ఒక్కసారిగా ఊడిన టైర్, హార్డ్ ల్యాండింగ్
అమెరికాలో ముకేష్ అంబానీ రూ. 25 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు.. ఇంత పెద్ద ఎత్తున ఏం చేస్తున్నారంటే?