తల్లి రొమ్ముపాలు తాగి... రక్తం కక్కుకొని చనిపోయిన బిడ్డ

First Published Jul 17, 2018, 10:11 AM IST
Highlights

తర్వాత 6గంటలకు బిడ్డ మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. దీంతో.. దగ్గరికి వెళ్లి చూడగా.. నోటి వెంట నురగ, రక్తం కారుతో వారి బిడ్డ కనిపించింది. దీంతో.. సమంత వెంటనే తన భర్త సహాయంతో బిడ్డను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

అప్పుడే పుట్టిన బిడ్డలకు తల్లిపాలే ఆహారం. ఆ పాలు అమృతంతో సమానం. కానీ.. అమృతంలాంటి ఆ పాలే ఓ బిడ్డకు విషమయ్యాయి. విషంగా మారిన తల్లి రొమ్ముపాలు తాగి.. ఓ బిడ్డ రక్తం కక్కుకొని చనిపోయాడు. ఈ సంఘటన న్యూయార్క్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పెన్సిలేనియాలో నివాసం ఉండే సమంతా విట్నీ జోన్స్ కి 11నెలల కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన తెల్లవారు జామున 3గంటలకు బిడ్డ ఆకలితో ఏడ్వడంతో సమంతా పాలు పట్టింది. తర్వాత నిద్రపోయింది.

తర్వాత 6గంటలకు బిడ్డ మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. దీంతో.. దగ్గరికి వెళ్లి చూడగా.. నోటి వెంట నురగ, రక్తం కారుతో వారి బిడ్డ కనిపించింది. దీంతో.. సమంత వెంటనే తన భర్త సహాయంతో బిడ్డను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

చనిపోయిన బిడ్డకు శవపరీక్ష నిర్వహించగా.. పిల్లాడి రక్తంలో నొప్పులు తగ్గడానికి వాడే మెథడోన్‌; చిత్త వైకల్యానికి వాడే యాంఫిటామైన్‌, మెథాఫెటమైన్‌ ఔషధ మూలాలు కనిపించాయి. 

సమంత వేసుకున్న కొన్ని మందుల కారణంగానే తల్లిపాలు విషమంగా మారినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. ఒకవైపు బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిపై పోలీసులు కేసు పెట్టడం గమనార్హం.  శుక్రవారం స్థానిక న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది. బిడ్డ మరణంతో జోన్స్‌ పుట్టెడు దుఃఖంతో ఉన్నారనీ... మెథడోన్‌ వేసుకున్నా, రొమ్ముపాలు ఇవ్వొచ్చని ‘కెనడియన్‌ ఫ్యామిలీ ఫిజీషియన్‌’ పత్రిక ఓ కథనంలో పేర్కొందని వాదనలు వినిపించారు. జోన్స్‌కు జీవితఖైదు పడవచ్చని న్యాయనిపుణులు పేర్కొన్నారు. 

click me!