ట్రంప్ ఆంక్షలు నిలిపివేత.. హెచ్1 బీ వీసాదారులకు ఊరట!

By telugu news teamFirst Published Dec 3, 2020, 8:03 AM IST
Highlights

హెచ్1-బీ వీసా విధానంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి.
 

అమెరికాలో భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. హెచ్1బీ వీసాల్లో ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది చివరి వరకు హెచ్1 బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదా లో డోనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

హెచ్1-బీ వీసా విధానంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి.

ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వీసా విధానంలో మార్పులు తీసుకురావడంలో ట్రంప్‌ సర్కార్‌ పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్‌ వ్యాఖ్యానించారు. 

ట్రంప్‌ ప్రభుత్వం వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. డిసెంబర్‌ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి.
 

click me!