హిస్టరీ... నిర్దోషిగా నిరూపించుకున్న ట్రంప్

By telugu teamFirst Published Feb 6, 2020, 8:38 AM IST
Highlights

దోషిగా తేల్చేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల సూపర్ మెజారిటీ కంటే చాలా తక్కువగా ఓట్లు రావడంతో ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డాడు.

చారిత్రాత్మక సెనేట్ ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను తాను నిర్దోషిగా నిరూపించుకున్నారు. తనపై మోపిన అభిశంసన ఆరోపణల నుంచి ఆయన బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం,  కాంగ్రెస్ ని అడ్డుకున్నారన్న ఆరోపణలపై సెనేట్ లో ఓటింగ్ జరిగింది. 

అయితే... ఈ ఓటింగ్ లో ట్రంప్ నిర్దోషి అని చెబుతూ అత్యధికంగా సభ్యులు ఓటు వేయడం గమనార్హం. అధికార దుర్వినియోగం ఆరోపణలపై 52మంది ట్రంప్ కి అనుకూలంగా ఓటు వేశారు. 48 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక కాంగ్రెస్ ని అడ్డుకున్నారనే విషయంలో ట్రంప్ ని నిర్దోషిగా తేలుస్తూ 53ఓట్లు ప డగా... వ్యతిరేకంగా 47మంది ఓట్లువేశారు. దీంతో ట్రంప్ పై అభిశంసన ఆరోపణలు వీగిపోయాయి.

Also Read ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు: సున్ని షియాల మధ్య జాతి వైరం దీనికి కారణం...

దోషిగా తేల్చేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల సూపర్ మెజారిటీ కంటే చాలా తక్కువగా ఓట్లు రావడంతో ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డాడు. మూడింట రెండొంతుల మంది సెనేటర్లు అతన్ని దోషిగా ప్రకటించలేదని, అభియోగాలు మోపబడినట్లు ట్రంప్ దోషి కాదని విచారణకు అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అన్నారు. 

దీంతో ఈ ఏడాది నవంబర్‌లో తిరిగి ఎన్నిక కావాలన్న తన ప్రచారంలో ట్రంప్ పూర్తిగా పాల్గొంటారు. ఈ విషయంలో ఇప్పుడు ఆయనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ మరోసారి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ట్రంప్ పై డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీలో నిల‌వ‌నున్నారు. 

ఈ సమయంలో జోసెఫ్ బైడెన్‌ను దెబ్బ‌తీసేందుకు ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీని ఓ ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ బెదిరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చిన విసయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఉన్న ఓ సంస్థ‌లో బైడెన్ కుమారుడు హంట‌ర్ బైడ‌న్‌ పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

వాటిపై విచార‌ణ చేపట్టాల‌ని ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడిని ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 250 మిలియన్ డాలర్ల సైనిక సాయం గురించి కూడా ట్రంప్ బెదిరించారని ఆరోపణలు వచ్చాయి.
 

click me!