కూతురు హోం వర్క్ చేయట్లేదని, కుక్క కాపలా: తండ్రి వెరైటీ ఆలోచన

By Siva KodatiFirst Published May 14, 2019, 1:31 PM IST
Highlights

 ఓ తండ్రి కూతురితో హోం వర్క్ చేయించే బాధ్యతను కుక్కకు అప్పగించాడు. 

ఇంటా బయటా ఎన్నో సమస్యలను చిటికెలో పరిష్కరించే తల్లిదండ్రులకు పిల్లలలో హోంవర్క్ చేయించడం ఎంతో కష్టం. అల్లరి పిడుగులు అల్లరి చేయకుండా వాళ్లు పని చేయరు కదా. ఎంత ట్రై చేసినా వాళ్లకాకపోతే హోంవర్క్‌ చేయించే బాధ్యతను ట్యూషన్ వాళ్లకు అప్పగించారు.

ఇలాంటి ఇబ్బంది పడ్డ ఓ తండ్రి కూతురితో హోం వర్క్ చేయించే బాధ్యతను కుక్కకు అప్పగించాడు. వివరాల్లోకి వెళితే.. చైనాకు సంబంజూ లియాంగ్ అనే వ్యక్తి తన కూతురి చేత హోం వర్క్ చేయించే బాధ్యతను తన పెంపుడు కుక్కకు అప్పగించాడు.

ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న లియాంగ్ కుక్కకు ట్రైనింగ్ సైతం ఇచ్చారు. దీంతో జూ కుమార్తె హోం వర్క్ చేసుకునేటప్పుడు.. ఆ కుక్క ఆమెకు ఎదురుగా నిల్చుని పర్యవేక్షిస్తుంటుంది.

ఒక వేళ ఆ అమ్మాయి గనుక హోం వర్క్ చేయకుండా మధ్యలో ఆటలు ఆడితే ఊరుకోదు.. దీనిపై జూ లియాంగ్ మాట్లాడుతూ... తొలుత ఈ కుక్కకు పిల్లి నుంచి ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనే అంశంపై ట్రైనింగ్ ఇచ్చానన్నారు.

ఈ క్రమంలో ఓ రోజు నా కుమార్తె హోంవర్క్ పూర్తి చేయకుండా గోల చేయడం చూశాను.. దాంతో నా కూతురి చేత హోంవర్క్ చేపించే బాధ్యత నా కుక్కకు ఇవ్వాలనుకున్నానని లియాంగ్ తెలిపాడు.

అందుకు అనుగుణంగా నా పెంపుడు కుక్కను ట్రైన్ చేశానని.. ఇప్పుడది నా కూతురు హోం వర్క్ మధ్యలో వదిలేసి ఫోన్‌తో ఆడాలని చూస్తే వెంటనే మొరుగుతుందన్నాడు.

దీనిపై జూ కూతురు మాట్లాడుతూ.. నా కుక్కతో కలిసి హోం వర్క్ చేయడం చాలా బాగుందని.. ఇంతకు ముందు హోంవర్క్ చేయాలంటే చాలా బోర్‌గా ఫీలయ్యేదానిని.. అయితే ఇప్పుడు తాను చాలా శ్రద్ధగా హోం వర్క్ పూర్తి చేస్తున్నానని వెల్లడించింది. 

click me!