Russia Ukraine War: మరిచిపోవద్దు.. అవి యుద్ధాలుగా పరిణమిస్తాయి: ఫ్రాన్స్‌కు రష్యా వార్నింగ్

Published : Mar 01, 2022, 07:53 PM IST
Russia Ukraine War: మరిచిపోవద్దు.. అవి యుద్ధాలుగా పరిణమిస్తాయి: ఫ్రాన్స్‌కు రష్యా వార్నింగ్

సారాంశం

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు తీవ్రం అవుతున్న తరుణంలో ప్రపంచ నేతల వ్యాఖ్యలు కూడా పదునుదేలుతున్నాయి. రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై రష్యా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్ రియాక్ట్ అయ్యారు. ఫ్రాన్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.   

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ (Ukraine) లో రష్యా (Russia) యుద్ధం (War) కొనసాగుతున్న తరుణంలో ప్రపంచ నేతల వ్యాఖ్యలు పదును తేలుతున్నాయి. అంతే కటువుగా వారి వ్యాఖ్యానాలు ఉంటున్నాయి. అదే విధంగా ఒకరికి మరొకరు కౌంటర్ ఇచ్చుకోవడం కూడా మొదలైంది. అదీ యుద్ధాలకు సంబంధించి వార్నింగ్‌లు ఇచ్చుకోవడం ఆందోళనకరంగా మారింది. ఫ్రాన్స్ (France) మంత్రి చేసిన వ్యాఖ్యలకు రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్ దిమిత్రీ మెద్వెదెవ్ (Dmitry Medvedev) గట్టి వార్నింగ్ (Warning) ఇచ్చారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వార్నింగ్ ఇచ్చారు.

‘ఇవాళ ఓ ఫ్రెంచ్ మంత్రి మాట్లాడుతూ, రష్యా పై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించినట్టు చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోండి జెంటిల్‌మెన్. ఒక విషయం మరవకండి. మానవ చరిత్రలో ఆర్థిక యుద్ధాలు నిజమైన యుద్ధాలుగా పరిణమించిన ఉదంతాలు కోకొల్లలు’ అని వార్నింగ్ ఇచ్చారు.

ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మేర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యాపై ఆర్థిక ఆంక్షలపై స్పందించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దాదాపుగా కుప్పకూల్చేస్తామని పేర్కొన్నారు. తాము విధించే ఆంక్షలతో సాధారణ రష్యా పౌరుడు కూడా ప్రభావితుడు కాకుండా ఉండలేడు అని వివరించారు. కానీ, దీన్ని మరో విధంగా ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు రియాక్షన్‌గానే మెద్వెదెవ్ పై వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో మాట్లాడే అవకాశాలు లేవని క్రెమ్లిన్ తెలిపింది.

ఇదిలా ఉండగా, ఖార్కివ్ నగరం (kharkiv) బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు (russian army) మిస్సెల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలను సైతం టార్గెట్ చేస్తున్నారు రష్యా సైనికులు. ఉదయం నుంచి క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లు మేయర్ ప్రకటించారు. ఖర్కీవ్ దగ్గర రష్యా దాడులు.. విద్యార్ధుల తరలింపునకు అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో విద్యార్ధుల తరలింపునకు సురక్షిత మార్గం కల్పించాలని రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది కేంద్ర విదేశాంగ శాఖ .

Kharkiv లోని ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రష్యన్ క్షిపణి భవనాన్ని తాకడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డు పై పెద్ద సంఖ్యలో వాహనాలు ఉండటం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే