కుప్పకూలిన రెస్టారెంట్‌: 29 మంది మృతి, 28 మందికి గాయాలు

Published : Aug 30, 2020, 03:47 PM IST
కుప్పకూలిన రెస్టారెంట్‌: 29 మంది మృతి, 28 మందికి గాయాలు

సారాంశం

చైనాలో ఓ రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో 29 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని  అధికారులు తెలిపారు.

బీజింగ్: చైనాలో ఓ రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో 29 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని  అధికారులు తెలిపారు.

ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో  గల జుక్సైన్ రెస్టారెంట్ కుప్పకూలడంతో 29 మంది మరణించారు. శనివారం నాడు  ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు.  ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ మంత్రిత్వ శాఖాధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు. ఆదివారం నాడు కూడ సహాయక చర్యలను చేపట్టారు. 

దేశ రాజధాని బీజింగ్ కు 630 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.రెస్టారెంట్ లో 80 ఏళ్ల వ్యక్తి బర్త్ డే పార్టీ నిర్వహించారు.ఈ పార్టీకి పెద్ద మొత్తంలో అతిథులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. దీంతోనే ఎక్కువ మంది మరణించారని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ భవనం శిథిలాల కింద చిక్కుకొన్న 59 మందిని సురక్షితంగా బయటకు తీశారు. 

PREV
click me!

Recommended Stories

Iran Israel War ఇంకెంతకాలం సాగుతుంది..ఎప్పుడు ఆగుతుంది..? అమెరికా ఏమంటోంది..?
Layoffs : టెక్ ఉద్యోగులకు ఏఐ గండం.. ఒక్క కంపెనీ నుండే 11,000 మంది ఔట్