Havana hotel blast: క్యూబా హోటల్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 70 మందికి పైగా గాయాలు.. అస‌లేం జరిగింది?

Published : May 08, 2022, 05:09 AM IST
Havana hotel blast: క్యూబా  హోటల్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 70 మందికి పైగా గాయాలు.. అస‌లేం జరిగింది?

సారాంశం

Havana hotel blast: క్యూబాలోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన భారీ పేలుడు 25 మందిని బలి తీసుకుంది. హవానాలోని 96 గదుల హోటల్‌లో శుక్రవా రం రాత్రి సహజవాయువు లీకేజీ వల్లే పేలుడు సంభవించిందని అధికారు లు తెలిపారు. 74 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. సుందరీకరణ పనుల వల్ల హోటల్‌లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.  

Havana hotel blast: క్యూబా రాజధాని హవానా లోని లగ్జరీ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఓ చిన్నారి సహా 25మంది చనిపోయారు. కనీసం 74 మంది గాయపడ్డారు. గ్యాస్ ట్యాంక్‌ను రీఫిల్ చేస్తున్నప్పుడు భారీ పేలుడు సంభవించిందని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ పేలుడు ధాటికి హోటల్ పూర్తిగా  ధ్వంసమయ్యాయి. హోటల్ బయట ఉన్న బస్సులు, కార్లు దెబ్బతిన్నాయి. శిధిలాల్లో చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు.

 96 గదులు గల ఈ సరటోగా హోటల్‌ను 1930 లో నిర్మించారు. దీనికి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున టూరిస్టులు ఎవరూ ఉండడం లేదని హవానా గవర్నర్ రెయినాల్డో గార్సియా జపటా చెప్పారు. ఇది బాంబు పేలుడు లేదా దాడి కాదని , ఇది అత్యంత ఘోర విషాదమని అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కేనెల్ ఆవేదన వెలిబుచ్చారు. హోటల్‌కు గ్యాస్ సరఫరా చేస్తున్న ట్రక్కులో పేలుడు జరిగిందని క్యూబా ప్రభుత్వ టివి ఛానల్ వెల్లడించింది. హోటల్ పక్కనున్న స్కూలులోని 300 మంది విద్యార్థులను వెంటనే ఖాళీ చేయించారు. హోటల్‌కు 110 గజాల దూరం వరకూ దిగ్బంధం చేశారు.

హవానా గవర్నర్ రేనాల్డో గార్సియా జపాటా మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు జరిగిన సమయంలో 96 గదుల సరటోగా హోటల్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున పర్యాటకులు ఎవరూ లేరని చెప్పారు. ఘటనాస్థలిని సందర్శించిన అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్.. ‘ఇది బాంబు దాడి లేదా దాడి కాదు’ అని ట్వీట్ చేశారు. ఇది విషాదకరమైన ప్రమాదమ‌ని అన్నారు. 

ఈ ప్రమాదంలో కనీసం 74 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని హాస్పిటల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ జూలియో గుయెర్రా ఇజ్క్విర్డో విలేకరులతో అన్నారు. గాయపడిన వారిలో 14 మంది చిన్నారులు ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. పేలుడు కారణంగా ప్రభావితమైన హోటల్ సమీపంలోని భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు డియాజ్-కానెల్ తెలిపారు. స్థానిక మీడియా ప్ర‌కారం.. హోటల్‌కు సహజ వాయువు సరఫరా చేస్తున్న ట్రక్కు పేలుడు సంభవించింది. అయితే, గ్యాస్ ఎలా మండిందనే విషయాన్ని స‌రైన స‌మాచారం లేదు.

ప్రమాదానికి సంబంధించిన వీడియోలో అగ్నిమాపక సిబ్బంది తెల్లటి ట్యాంకర్ ట్రక్కుపై నీటిని చల్లడం. దానిని అక్కడి నుండి తొలగించడం చూడవచ్చు. పేలుడు కారణంగా హోటల్ చుట్టూ పొగలు కమ్ముకున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు రోడ్డుపై పరుగులు తీశారు. కరోనావైరస్ మహమ్మారితో నాశనమైన తన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి క్యూబా కష్టపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో గాయపడిన వారి సంఖ్య పెరగవచ్చని క్యూబా ఆరోగ్య మంత్రి జోస్ ఎంగెల్ పోర్టల్ అసోసియేటెడ్ ప్రెస్ (AP)కి తెలిపారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నామని అగ్నిమాపక శాఖ లెఫ్టినెంట్ కల్నల్ నోయెల్ సిల్వా తెలిపారు. హోటల్ పక్కనే ఉన్న 300 మంది విద్యార్థులున్న పాఠశాలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని గార్సియా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే