గుడ్‌న్యూస్ చెప్పిన ఫైజర్: కరోనా వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తుంది

By narsimha lodeFirst Published Nov 9, 2020, 6:17 PM IST
Highlights

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టుగా ఫైజర్ సంస్థ సోమవారం నాడు ప్రకటించింది.కరోనా వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తోందని ఫైజర్ సంస్థ ప్రకటించింది.


మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టుగా ఫైజర్ సంస్థ సోమవారం నాడు ప్రకటించింది.కరోనా వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తోందని ఫైజర్ సంస్థ ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్ ను ఫైజర్, బయోటెక్ సంస్థలు వృద్ధి చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో  మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టుగా ఫైజర్, బయోఎంటెక్ లు ప్రకటించాయి. 

మూడో విడత కరోనా వ్యాక్సిన్ ట్రయల్ ఫలితాల మొదటి సెట్ కోవిడ్ ను నివారించగల టీకా సామర్ధ్యానికి ప్రాథమికసాక్ష్యాలను అందిస్తుందని ఫైజర్ చైర్మెన్ సీఈఓ అర్బర్ట్ బౌర్లా ప్రకటనలో తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కరోనా నుండి విముక్తి కోసం వ్యాక్సిన్ కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ప్రపంచానికి చాలా అవసరమైన సమయంలో తమ టీకా అభివృద్ధి కార్యక్రమంలో తాము కీలకమైన మైలురాయిని చేరుకొంటున్నామని బౌర్లా చెప్పారు.

ప్రపంచంలో కరోనా ఇన్‌ఫెక్షన్ రేట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. సరపరా అంచనాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులను 2021 లో 1.3 బిలియన్ మోతాదులను సరఫరా చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి.


 

click me!