మా బంధువులు ముంబైలో ఉన్నారు.. జో బిడెన్...!

By AN TeluguFirst Published Nov 9, 2020, 11:31 AM IST
Highlights

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన బంధువులు ముంబైలో ఉన్నారని చెప్పి ఆశ్చర్యపరిచారు. దీని గురించి గతంలోబిడెనే స్వయంగా వెల్లడించారు. వివరాల్లోకి వెడితే..

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన బంధువులు ముంబైలో ఉన్నారని చెప్పి ఆశ్చర్యపరిచారు. దీని గురించి గతంలోబిడెనే స్వయంగా వెల్లడించారు. వివరాల్లోకి వెడితే..

ఉత్కంఠభరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధించారు. త్వరలోనే 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ క్రమంలో బిడెన్ బంధువులు కొందరు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉన్నట్లు ఓ ఆసక్తి కర వార్త వెలుగులోకి వచ్చింది. 

దీని గురించి 2013లో వైస్‌ ప్రెసిడెంట్‌ పర్యటనలో భాగంగా ముంబైలో ఐదుగురు బిడెన్ లు ఉన్నారని  గతంలో బిడెనే స్వయంగా వెల్లడించారు.  భారత్‌లో ఇస్టిండియా పాలన కాలంలో తన పూర్వీకులు ఇండియాలో పని చేశారని.. రిటైర్‌మెంట్‌ తర్వాత ముంబైలోనే స్థిరపడ్డారని బిడెన్  స్వయంగా తెలిపారు.

బిడెన్ మాట్లాడుతూ.. ‘నా 29వ ఏట 1972లో తొలిసారి సెనెటర్‌గా ఎన్నికయ్యాను. ఆ సమయంలో నాకు వచ్చిన ఓ ఉత్తరాన్ని ఎప్పటికి మర్చిపోను. పేరు చివర బైడెన్‌ అని ఉన్న ఓ పెద్దమనిషి దగ్గర నుంచి నాకు ఆ ఉత్తరం వచ్చింది. నా పేరు.. ముంబైలో ఎలా అని ఆశ్యర్యపోయాను. 

అప్పుడు నా గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ జార్జ్‌ బిడెన్ ఈస్ట్‌ఇండియా ట్రేడింగ్‌ కంపెనీలో కెప్టెన్‌గా పని చేశారని.. భారతీయ మహిళను వివాహామాడి ఇండియాలోనే స్థిరపడ్డారని తెలిసింది. అలా ఇండియాలో నా బంధువులు ఐదుగురు ఉన్నారనే విషయం నాకు తెలిసింది’ అన్నారు.  

దీని గురించి వంశవృక్ష శాస్త్రవేత్తలు ఎవరైనా పరిశోధన చేస్తే బాగుంటుందని బిడెన్ అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలతో పాటు ముంబైలోని తన బంధువుల ఫోన్ నంబర్ల వివరాలను తనకు అందించాల్సిందిగా అప్పట్లో బిడెన్ కోరారు. 

భారత-అమెరికా సివిల్ న్యూక్లియర్‌ డీల్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా 2015లో వాషింగ్టన్‌లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ కార్యక్రమంలో బైడెన్‌ దీని గురించి మరో సారి మాట్లాడారు.  అయితే ఇప్పటి వరకు ఆయన ముంబై బంధువులు ఎవరనేది తెలియ లేదు. అంతేకాక మేం బిడెన్ బంధువులమంటూ ఎవరు ప్రకటించలేదు.

click me!