ఒక్కసారి కరోనా వస్తే.. 8 నెలల వరకు సేఫ్ !!

By AN TeluguFirst Published Dec 24, 2020, 2:07 PM IST
Highlights

ఒకసారి కరోనా బారిన పడ్డవారు ఆ తరువాత ఎనిమిది నెలలపాటు వ్యాధినిరోధకత సాధిస్తారని తాజా అధ్యయనాల్లో తేలింది. కరోనా సోకితే భయపడాల్సిన పని లేదని 
ఒకసారి కరోనా సోకితే కనీసం 8 నెలలపాటు ఆ వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
కరోనా నియంత్రణకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ద్వారా ఎక్కువ కాలం రక్షణ లభించే అవకాశముందని తమ పరిశోధన ద్వారా తెలుస్తోందని ఆస్ట్రేలియా లోని మొనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త మెమో వాన్‌ జెల్మ్‌ తెలిపారు. 

సైన్స్‌ ఇమ్యూనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. కరోనా బారినపడ్డవారిలో రోగ నిరోధక వ్యవస్థకు చెందిన మెమరీ బీ–సెల్స్‌ను గుర్తించారు. ఈ కణాలు వ్యాధి, వైరస్‌ రెండింటినీ గుర్తుంచుకుంటాయి. ఒకవేళ మళ్లీ వైరస్‌ దాడి చేస్తే ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి యాంటీ బాడీలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. 

పరిశోధనల్లో భాగంగా 25 మంది కరోనా సోకిన వారిని ఎంపిక చేశామని, వ్యాధికి గురైన నాలుగో రోజు నుంచి 242వ రోజు వరకు పరిశీలించామని వాన్‌ జెల్మ్‌ తెలిపారు. వైరస్‌ నిరోధానికి ఉపయోగపడే యాంటీబాడీలు 20వ రోజు నుంచి తగ్గిపోవడం మొదలైందని, కాకపోతే మెమరీ బీ– సెల్స్‌ చివరి రోజు వరకు కొనసాగాయని పేర్కొన్నారు. ఈ మెమరీ సెల్స్‌ వైరస్‌ కొమ్ము, న్యూక్లియో ప్లాస్టిడ్‌ ప్రొటీన్‌ రెండింటినీ గుర్తించగలదన్నారు.  

click me!