Russia Ukraine Crisis: బాంబుల మోతలే పెండ్లి బాజాలు.. రష్యా దాడి కొనసాగుతున్నవేళ ఒక్కటైన జంట !

Published : Mar 03, 2022, 01:12 PM IST
Russia Ukraine Crisis: బాంబుల మోతలే పెండ్లి బాజాలు.. రష్యా దాడి కొనసాగుతున్నవేళ ఒక్కటైన జంట !

సారాంశం

Russia: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. దానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే, ర‌ష్యా ద‌ళాల దాడుల కొన‌సాగుతున్నవేళ‌.. బాంబుల మోత‌లే పెండ్లి బాజాలుగా.. ఉక్రెయిన్‌లోని ఒడెసాలోని బాంబు షెల్టర్‌లో ఓ జంట ఒక్క‌టైంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.   

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. దానిపై బాంబుల ర‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు గుర్తుప‌ట్ట‌లేని విధంగా మారాయి. ప్ర‌జ‌లు ప్రాణాలు ర‌క్షించుకోవ‌డానికి అండ‌ర్ గ్రౌండ్ షెల్ట‌ర్స్ లో త‌ల‌దాచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ లో జ‌రిగిన ఓ పెండ్లి ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ర‌ష్యా  ద‌ళాల దాడుల కొన‌సాగుతున్నవేళ‌.. బాంబుల మోత‌లే పెండ్లి బాజాలుగా.. ఉక్రెయిన్‌లోని ఒడెసాలోని బాంబు షెల్టర్‌లో ఓ జంట (Couple gets married) ఒక్క‌టైంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ఉక్రెయిన్ పై ర‌ష్య త‌న దాడిని మ‌రింత‌గా పెంచుతూ.. బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్రెయిన్ బాంబుల మోత‌తో.. భారీ పేలుళ్ల‌తో ద‌ద్ద‌రిల్లిపోతోంది. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ లోని ఒడెసా నగరంలో ఉన్న ఓ బాంబ్ షెల్టర్‌లో ఒక‌ జంట వివాహం చేసుకుంది. యుద్ధ సైర‌న్లు, బాంబుల మోత‌లు, భారీ పేలుళ్లు ఈ వివాహానికి బాజాభ‌జంత్రీలుగా మారాయి. ఒక బెలారసియన్ మీడియా సంస్థ వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాల‌ను పంచుకుంది. అందులో ఈ జంట పువ్వులు ప‌ట్టుకుని.. ఆనందంగా కనిపిస్తున్న దృశ్యాలు క‌నిపించాయి. 

అంతకు ముందు కూడా ఓ జంట వివాహం ( Couple gets married) చేసుకుంది. వెంటనే వారు  ఆయుధాలు చేతపట్టుకుని దేశ రక్షణ కోసం ముందుకు కదిలారు. ఉక్రేనియన్ జంట కైవ్‌లోని ఒక చర్చ్ లో వివాహం చేసుకున్నారు. వారు ముందుగా ఈ పెళ్లి కోసం ఎంతో ప్లాన్ చేసుకున్నారు. పావురాలను ఎగరవేయడం, స్నేహితులు, బంధువులతో చర్చ్ లోకి వెళ్లడం.. వారికి పెద్దగా విందు ఇవ్వడం..లాంటివి. కానీ రష్యా దాడి నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోాయయి.  వారికి చర్చిలోని పావురాల కూతలే పెళ్లి స్వాగతాలయ్యాయి. పెళ్లి తరువాత బయటికి వచ్చేప్పుడు యుద్ధసైరన్ల మోతాలు కొత్త జీవితానికి స్వాగతం పలికాయి. తమ దేశం యుద్ధంలో ఉందని వీరికి తెలుసు కానీ యారినా అరివా,  ఆమె భాగస్వామి స్వియాటోస్లావ్ ఫర్సిన్‌కి వేరే మార్గం లేదు. ‘పరిస్థితులు బాగాలేవని మాకు తెలుసు. మాతృభూమి కోసం పోరాడబోతున్నాం" అని అరివా అన్నారు, "బహుశా మేం చనిపోవచ్చు, అయితే.. అన్నింటికంటే ముందు మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం" అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే