6 గంటల పాటు ఖర్కివ్‌లో రష్యా దాడులను ఆపగలిగిన భారత్.. ఫలించిన మోదీ మంతనాలు!

Published : Mar 03, 2022, 12:41 PM ISTUpdated : Mar 03, 2022, 12:46 PM IST
6 గంటల పాటు ఖర్కివ్‌లో రష్యా దాడులను ఆపగలిగిన భారత్.. ఫలించిన మోదీ మంతనాలు!

సారాంశం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించి భారత ప్రభుత్వం రష్యాతో సంప్రదింపులు జరిపింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించి భారత ప్రభుత్వం రష్యాతో సంప్రదింపులు జరిపింది. ఖర్కివ్‌లో చిక్కుకున్న భారతీయులు వెంటనే ఆ ప్రాంతాన్ని వీడాలని భారత ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. 

ఖర్కివ్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రక్షించేందుకు రష్యా ఆరు గంటల పాటు దాడులను నిలిపివేసేందుకు అంగీకరించింది. భారత్ చొరవతో రష్యా  ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ ప్రజలను ఖర్కివ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దుల దేశాలకు సురక్షితంగా తీసుకెళ్లేందుకు ఈ గ్యాప్ తీసుకున్నారు.
 

 

 

 

 

ఉక్రెయిన్ నుంచి యుద్ధ ప్రాతిపదికన భారతీయుల తరలింపు కొనసాగుతోంది. అయితే భారతీయ విద్యార్థులు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లోని వారిని తరలించడం ఇబ్బందికరంగా మారింది. అక్కడి నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది ఈ క్రమంలోనే ప్రధాని మోడీ పుతిన్ కు ఫోన్ చేశారు.

భారతీయుల తరలింపుపై పుతిన్‌తో మోదీ చర్చించారు. ఖర్కివ్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని పుతిన్‌ను మోదీ కోరారు.ఈ క్రమంలోనే ఖర్కివ్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలింపు సాధ్యమయ్యేలా ఖర్కివ్‌లో ఆరు గంటల పాటు రష్యా బలగాల దాడులు నిలిపివేసేందుకు అంగీకరించింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే