కరోనా రోగులకు వైద్యం.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే..!

By telugu news teamFirst Published Feb 13, 2020, 9:33 AM IST
Highlights

కరోనా రోగులకు చికిత్సకు అయిన బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సింగపూర్ దేశంలోని పాలీక్లినిక్ లు, క్లినిక్ లు, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు చికిత్స చేయించుకుంటే వాటి బిల్లులన్నీ చెల్లించాలని సింగపూర్ సర్కారు నిర్ణయించింది. 

చైనాలో మొదలై ప్రపంచ దేశాలకు పాకింది కరోనా వైరస్. దీనిని ఇప్పుడు కోవిడ్-2019 గా పిలుస్తున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ వైరస్ చాలా దేశాలకు పాకగా.. తాజాగా సింగపూర్ కి సైతం పాకేసింది. దీంతో ఆ దేశానికి ఎవరూ వెళ్లకూడదంటూ ఇతర దేశాలు హెచ్చిరకలు కూడా జారీ చేశాయి.

Also Read కరోనా ఎఫెక్ట్... సింగపూర్ లో పర్యటించొద్దంటూ హెచ్చరికలు...

ఇప్పటికే అక్కడ 50 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు చికిత్సకు అయిన బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సింగపూర్ దేశంలోని పాలీక్లినిక్ లు, క్లినిక్ లు, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు చికిత్స చేయించుకుంటే వాటి బిల్లులన్నీ చెల్లించాలని సింగపూర్ సర్కారు నిర్ణయించింది. 

కరోనా వైరస్ (కోవిడ్-19) గత నెల 23వతేదీన ప్రబలింది. చైనా దేశంలో ప్రబలిన ఈ కోవిడ్-19 వైరస్ సింగపూర్ లోని ఎయిరోస్పేస్ హైట్స్ లో పనిచేస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులకు సోకింది. ప్రపంచంలోనే చైనా దేశం తర్వాత ఈ కోవిడ్-19 వైరస్ సింగపూర్ లోనే ఎక్కువ మంది రోగులకు వచ్చింది. దీంతో ఈ రోగుల చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సింగపూర్ సర్కారు నిర్ణయించింది.

click me!