కరోనా దెబ్బ: వాట్సాప్ వినియోగదారులకు పెద్ద షాక్!

By Sree s  |  First Published Mar 29, 2020, 6:23 PM IST

తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుండగా కారొనకు సంబంధించి ఫేక్ న్యూస్ చాలా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఎలాగైనా అరికట్టేందుకు వాట్సాప్ యాజమాన్యం కంకణం కట్టుకుంది. 


  కరోనా దెబ్బకు ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. ఈ మహమ్మారికి మందు లేక ప్రపంచ దేశాలన్నీ తమకు తోచిన విధంగా చికిత్సనందిస్తూ... మందు లేదు గనుక ఈ వైరస్ బారినపడకుండా తమ దేశ ప్రజలను చూసుకోవడమే ఏకైకా మార్గంగా ముందుకు వెళుతున్నాయి. 

ఇలా ఈ వైరస్ బారిన పడకుండా, వైరస్ సోకినవాళ్లను ఎవరితో కలవనీయకుండా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ని ఆపాలని అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ కూడా అందుకోసమే లాక్ డౌన్ విధించింది. 

Latest Videos

undefined

ఇక ఇండ్లలో అందరూ ఖాళీగా ఉన్నదెగ్గరి నుంచి సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. అన్ని సోషల్ మీడియాలు ఒకెత్తయితే... అందరూ పర్సనల్ గా ఫీల్ అయ్యే వాట్సాప్ మరో ఎత్తు. ఇందులో సమాచారం మనం ఎవ్వరికి పంపితే వారు మాత్రమే చూడగలుగుతారు కాబట్టి ఇందులో ఫేక్ న్యూస్ అత్యధికంగా సర్క్యూలేట్ అవుతుంది. 

తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుండగా కారొనకు సంబంధించి ఫేక్ న్యూస్ చాలా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఎలాగైనా అరికట్టేందుకు వాట్సాప్ యాజమాన్యం కంకణం కట్టుకుంది. 

సోషల్ డిస్టెన్సిన్గ్ ఉన్నందున కరోనా కు సంబంధించిన సమాచార వినిమయానికి ఈ వాట్సాప్ ను వాడుతున్నందున చాలా మంది కరోనా కు సంబంధించిన విషయాలను స్టేటస్ లు గా పెడుతున్నారు. చాలా మంది తెలియక ఫేక్ న్యూస్ వలలో పడిపోతున్నారు. 

అందుకోసమని ఇప్పటివరకు 30 సెకండ్లపాటు ఉన్న వాట్సాప్ స్టేటస్ నిడివిని 15 సెకండ్లకు కుదించింది వాట్సాప్. ఇలా చేయడం వరకు ఇంతలోకొంత ఫేక్ న్యూస్ కి అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్ యాజమాన్యం భావిస్తోంది. 

ఇకపోతే... ఇండ్లలో ఉంటున్న చాలామంది సీరియళ్లను చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వారికి కూడా ఒక చేదు వార్త. అన్ని రంగాలని ప్రభావితం చేసిన కరోనా సినిమా రంగాన్ని కూడా కోలుకొని విధంగా దెబ్బ తీస్తోంది. ఇప్పటికే కరోనా ప్రభావంతో అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. 

టివి సీరియల్స్ షూటింగ్స్ కూడా నిలిపేశారు. దీనితో నటీనటులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టివి సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ ప్రసారాలు ఆగిపోనున్నాయి. 

కరోనా ఎఫెక్ట్.. భార్య చెప్పిందని అలీ ఏం చేస్తున్నాడో చూశారా!

దీనితో ఛానల్ యాజమాన్యాలు ఇకపై సినిమాలనే ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో పాత సీరియల్స్ ని రిపీట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇంట్లో ఉండే గృహిణులకు, మహిళలకు ఎక్కువ కాలక్షేపం సీరియల్స్ తోనే. ఆ సీరియల్ ప్రసారాలు ఆగిపోనుండడం వారికి చేదు వార్తే. కరోనా ప్రభావం తగ్గి, షూటింగ్ తిరిగి ప్రారంభమైతేనే బుల్లితెరపై సీరియల్స్ ప్రసారం సాధ్యం అవుతుంది. 

కరోనా వైరస్ జన జీవితాలని పూర్తిగా స్తంభింపజేసి విధంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కరోనా అదుపులోకి రావడం లేదు. 

click me!