సెల్ ఫోన్ టవర్ల వల్ల కరోనా వ్యాప్తి, ఈ ఫేక్ న్యూస్ దెబ్బకు టవర్లు ధ్వంసం

By Sree s  |  First Published Apr 13, 2020, 4:40 PM IST

5జి నెట్వర్క్ కరోనా వైరస్ కణాలను అధికంగా ఆకర్షిస్తుందని, అందువల్ల ఈ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుందని అక్కడ పుకార్లు షికార్లు చేయడంతో ప్రజలు ఈ టవర్లను ధ్వంసం చేస్తున్నారు.  


ఫేక్ న్యూస్... ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక ప్రధాన సమస్య. ఇప్పుడీ కరోనా కష్టకాలంలో ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించడమే కష్టంగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు చప్పట్లు కొట్టమన్నప్పుడు, మొన్న దీపాలు వెలిగించమన్నప్పుడు ఆ ఫేక్ న్యూస్ ఏ లెవెల్ లో వైరల్ అయ్యాయో వేరుగా చెప్పనవసరం లేదు. 

ఈ ఫేక్ న్యూస్ ఏదో మన ఒక్కదేశానికే చెందిన సమస్య కాదు. ఈ కరోనా సమయంలో మనదేశంలో ఎంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో విదేశాల్లోనూ అదే పరిస్థితి ఉంది. బ్రిటన్ లో జరిగిన సంఘటనను చూస్తే మాత్రం మన దేశం కొంచం నయం అనిపించక మానదు. 

Latest Videos

మనదేశంలో మనం ఇప్పుడు 4జి నెట్వర్క్ ని విరివిగా వాడుతున్నాం. బ్రిటన్ మనకన్నా కొంచం అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అక్కడ 5జి నడుస్తోంది. అక్కడ ఉన్నట్టుండి గత కొన్ని రోజులుగా బ్రిటన్ అంతటా 5జి సెల్ ఫోన్ టవర్లపై దాడులు అధికంగా జరుగుతున్నాయి. 

దానికి ఒక ఫేక్ న్యూస్ కారణం అని తెలుసుకొని విస్తుపోయిన ప్రభుత్వం ప్రజలకు ఆ విషయంపై అవగాహనా కల్పించే పనిలో పడింది. 5జి నెట్వర్క్ కరోనా వైరస్ కణాలను అధికంగా ఆకర్షిస్తుందని, అందువల్ల ఈ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుందని అక్కడ పుకార్లు షికార్లు చేయడంతో ప్రజలు ఈ టవర్లను ధ్వంసం చేస్తున్నారు.  

undefined

ఇప్పటికే అక్కడ దాదాపుగా ఒక 5 సెల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేసారు. అత్యధికంగా వోడాఫోన్ కి చెందిన టవర్లు ధ్వంసం అయ్యాయి. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని, ఈ ఫేక్ న్యూస్ వల్ల ప్రభవితులై ఆ టవర్లపైన విరుచుకుపడుతున్నారు. 

ఇకపోతే మనదేశంలో జియో ఫైబర్ నెట్ కస్టమర్ల బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్‌తో  డేటా వినియోగం బాగా పెరిగింది. దాదాపుగా ఐటీ ఉద్యోగులతోపాటు ఇతర రంగాల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో డేటా వినియోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జియో ఫైబర్ తన యూజర్లందరికీ అన్ని ప్లాన్లలోనూ డబుల్ డేటాను ఆఫర్ చేస్తోంది. 


4జీ ప్లాన్ సబ్ స్క్రైబర్లందరికీ కనిష్టంగా రూ.699లకు 100 ఎంబీపీఎస్ డేటా పొందే వారికి డబుల్ డేటా అందజేస్తోంది. రూ.199 విలువైన ఈ ప్లాన్ కింద ఒక టిగా బైట్ డేటా వారం పాటు అందించనున్నది. తమ ఖాతాదారులు హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్‌తో అనుసంధానమయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జియో ఫైబర్ చెప్పింది. 

ఈ ప్లాన్‌ను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో హై-స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలను అందించేందుకు జియో ఫైబర్ తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచింది.

రాష్ట్రంలో దశల వారీగా జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో మరిన్ని నగరాలకు జియో ఫైబర్ సేవలు విస్తరించనున్నట్టు ప్రకటించింది.

స్టే కనెక్టెడ్, స్టే ప్రొడక్టివ్‌లో భాగంగా జియో ఫైబర్ తన యూజర్లకు డబుల్ డేటా ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. కొత్త యూజర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్, 100 జీబీ డేటాతో ఉచిత కనెక్టివిటీ ఇస్తోంది. 

చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్ నగర్, నల్గగొండలలో జియో ఫైబర్ తన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ స్పీడ్‌ను ఒక గిగా ఫైబర్ దాకా పెంచింది.

ఇంటి నుంచి పని చేస్తున్నవారికి హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడం ద్వారా మద్దతుగా నిలవాలని కంపెనీ భావిస్తోందని జియోఫైబర్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాలతోపాటు ఇతర ప్రధాన పట్టణాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.   

click me!