బ్రేకింగ్ న్యూస్.. కరోనా వైరస్ కి మందు దొరికిందోచ్

By telugu news teamFirst Published Mar 14, 2020, 1:03 PM IST
Highlights

 ఈ వైరస్ పేరు వింటేనే భయపడిపోయే వారికి కాస్త ఊరట లభించనుంది. ఎందుకంటే ఈ వైరస్ ని ఎదురించే వ్యాక్సిన్ ని కనుగొన్నారు.  కెనడాకి చెందిన ఓ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది.
 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కి విరుగుడు దొరికేసింది. చైనా లోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకేసింది. ఇప్పటి వరకు 4వేల మందికిపైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. భారత్ లోనూ ఇద్దరు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ భయాందోళనలను కలిగిస్తోంది.

అయితే... ఈ వైరస్ పేరు వింటేనే భయపడిపోయే వారికి కాస్త ఊరట లభించనుంది. ఎందుకంటే ఈ వైరస్ ని ఎదురించే వ్యాక్సిన్ ని కనుగొన్నారు.  కెనడాకి చెందిన ఓ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది.

Also Read కరోనా బాధితులకు పోర్న్ సైట్ బంపర్ ఆఫర్...

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా( కోవిడ్19) వైరస్ కి తమ వద్ద వ్యాక్సిన్ ఉందని కెనడాకి చెందిన మెడికాగో కంపెనీ ప్రకటించింది. వైరస్ జన్యు నిర్మాణం లభించిన 20రోజుల్లోనే వ్యాక్సిన్ ను తయారు చేశామని ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరికొత్త సాంకేతికత సాయంతో రూపించిన ఈ  వాక్సిన్ ను ఎఫ్ డీఏ అనుమతి కోసం పంపినట్లు చెప్పారు.

ఈ వ్యాక్సిన్ గురించి మెడికాగో సీఈవో బ్రూస్ క్లార్క్ మాట్లాడుతూ.. రెగ్యులేటరీ అడ్డంకులు గనక తొలిగిపోతే తమ సంస్థ నెలకు 10 మిలియన్ మోతాదుల మెడిసిన్‌ను ఉత్పత్తి చేయగలదని చెప్పారు. అంతేకాకుండా నవంబర్ 2021 నుంచి ఈ మందు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయిల్‌కు చెందిన ఓ పరిశోధనశాల కూడా కరోనాకు మందు కనిపెట్టినట్లు పేర్కొంది. అయితే క్లార్క్ మాత్రం ఇజ్రాయిల్ ప్రయోగశాల ఉపయోగించిన టెక్నాలజీని తాము సీజనల్‌గా వచ్చే ఫ్లూ వ్యాధులను నియంత్రించడం కోసం ఎప్పుడో ఉపయోగించామని తెలిపారు.

ఇక మరికొంతమంది అయితే ఆర్ఎన్ఏ, డీఎన్ఏల ద్వారా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేశారని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వ్యాధిని నియంత్రించేందుకు తయారు చేసిన వాక్సిన్ సక్సెస్ అయినట్లు దాఖలాలు లేవు. అయితే క్లార్క్ టీమ్ ఇంత వేగంగా ఎలా వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగారన్నది ప్రశ్న. దానికి సమాధానం వాళ్లు కోడిగుడ్లకు బదులు మొక్కలను బయో రియాక్టర్‌గా ఉపయోగించడం జరిగింది.

click me!