అమెరికా సూపర్ మార్కెట్లో కాల్పులు: పోలీసు సహా పది మంది మృతి

Published : Mar 23, 2021, 07:25 AM ISTUpdated : Mar 23, 2021, 08:14 AM IST
అమెరికా సూపర్ మార్కెట్లో కాల్పులు: పోలీసు సహా పది మంది మృతి

సారాంశం

అమెరికాలోని బౌల్డర్ లో గల ఓ సూపర్ మార్కెట్లో సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు సహా పలువురు మరణించారు.

కొలరాడో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా పశ్చిమ ప్రాంతంలోని కొలొరాడో రాష్ట్రంలోని ఓ సూపర్ మార్కెట్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కారణమేమీ చెప్పకుండా సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు సహా పది మంది మరణించారు. 

అనుమానితుడు కూడా గాయపడ్డాడు. అతను పోలీసు కస్టడీలో ఉన్నాడు. బౌల్డర్ లోని కింగ్ సూపర్స్ స్టోర్ లో కాల్పులు జరిగిన విషయాన్ని బౌల్డర్ పోలీసు కమాండర్ కెర్రీ యమగూచి చెప్పారు.

ఆ ఘటనలో పలువురు మరణించారని, మృతుల్లో బౌల్డర్ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నాడని యమగూచి మీడియాకు చెప్పారు చొక్కా లేకుండా రక్తమోడుతున్న ఓ మధ్యవయస్కుడిని స్టోర్ వెలుపలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వీడియో లైవ్ స్ట్రీమ్ ను బట్టి అర్థమవుతోంది. 

అయితే, తమ అదుపులో ఉన్నది ఆ వ్యక్తి అవునా, కాదా అనే విషయాన్ని యమగూచి చెప్పలేదు. సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఆ తర్వాత స్టోర్ వెనక ద్వారం నుంచి పారిపోయాడు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే