వేడి వేడి సూప్ లో చచ్చిన ఎలుక.. వైరల్

Published : Sep 14, 2018, 10:57 AM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
వేడి వేడి సూప్ లో చచ్చిన ఎలుక.. వైరల్

సారాంశం

అందరికీ సూప్ ఆర్డర్ చేయగా.. ఆమెకు వచ్చిన సూప్ లో ఎలక ఉంది. అది గమనించకుండానే కొద్ది మేర సూప్ తాగేసింది. ఆ తర్వాత అందులో ఎలక చచ్చి ఉండటాన్ని గమనించింది.

రెస్టారెంట్ కి వెళ్లి మంచి ఫుడ్ తినాలనుకున్న ఓ మహిళకి చేదు అనుభవం ఎదురైంది. సూప్ ఆర్డర్ చేస్తే.. అందులో చచ్చిన ఎలుక ఒకటి కనపడింది. అది చూసి షాకయిన  కష్టమర్.. దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...చైనాలోని షాన్డాంగ్ ప్రాంతంలో గల ఒక ఫేమస్ రెస్టారెంట్‌కు వచ్చిన ఒక మహిళకు అందించిన సూప్‌లో ఒక చచ్చిన చిట్టెలుక కనిపించింది. ఈ ఘటనతో ఆ రెస్టారెంట్ మూతపడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సదరు మహిళ తన కుటుంబ సభ్యులతో పాటు షియాబూ-షియాబూ అనే రెస్టారెంట్‌కు వచ్చారు. 

అందరికీ సూప్ ఆర్డర్ చేయగా.. ఆమెకు వచ్చిన సూప్ లో ఎలక ఉంది. అది గమనించకుండానే కొద్ది మేర సూప్ తాగేసింది. ఆ తర్వాత అందులో ఎలక చచ్చి ఉండటాన్ని గమనించింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది‌ ఈ రెస్టారెంట్ హాట్‌పాట్ డిష్‌ల తయారీలో ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఘటన అనంతరం ఆ మహిళకు రెస్టారెంట్ నిర్వాహకులు తక్షణ ఆర్ధిక సాయం అందించారు. అలాగే ఈ రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు