జీ జిన్‌పింగ్ నియంతృత్వం: తనను విమర్శించాడని.. బిలియనీర్‌కు 18 ఏళ్ల జైలు

By Siva KodatiFirst Published Sep 22, 2020, 3:41 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరోసారి తన నియంతృత్వాన్ని చాటుకున్నారు. తనను విమర్శించినందుకు గాను ఏకంగా ఓ బిలియనీర్‌కు 18 ఏళ్ల పాటు కటకటాల్లోకి నెట్టారు.

అమెరికా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరోసారి తన నియంతృత్వాన్ని చాటుకున్నారు. తనను విమర్శించినందుకు గాను ఏకంగా ఓ బిలియనీర్‌కు 18 ఏళ్ల పాటు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే.. రెన్ జికియాంగ్ అనే బిలియనీర్‌కి చైనా అధికారులతో సత్సంబంధాలు వున్నాయి.

ఈ క్రమంలో మార్చిలో జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా ఓ ఎస్సై రాశారు. దీనిలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆ తర్వాత తనపై జిన్‌పింగ్ తనపై చర్యలు తీసుకుంటాడని భావించిన రెన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

ఆ తర్వాతే ఆయనపై అవినీతి కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా బీజింగ్ కోర్టు రెన్ పలు తప్పులు చేసినట్లు చెప్పింది. వీటీలో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని, లంచాలు తీసుకున్నారని వ్యాఖ్యానించింది.

కంపెనీలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అక్రమాలకు పాల్పడటం వల్ల ఆ కంపెనీకి రూ.126 కోట్ల నష్టం వచ్చిందని కోర్టు తెలిపింది. దీనికి శిక్షగా 18 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.45 కోట్ల ఫైన్ విధించింది.

రెన్ అక్రమంగా సంపాదించినదంతా రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. తన నేరాలను రెన్ అంగీకరించారని, కోర్టు తీర్పును సైతం స్వాగతించారని న్యాయమూర్తి వెల్లడించింది.

మరోవైపు చైనాలో కోర్టు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. 99 శాతం అమలవుతాయి. 69 ఏళ్ల వయసున్న రెన్ జీవితం ఇక జైలుకే పరిమితం కావొచ్చు. మరోవైపు ఈ తీర్పును ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నారు. మున్ముందు ఎవరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలనే కుట్రతోనే జిన్ పింగ్ ఇంత పెద్ద శిక్ష వేయించి ఉంటాడనే అనుమానాలున్నాయి. 

click me!