తోకముడిచిన చైనా: గాల్వన్ వ్యాలీలో సైన్యం వెనక్కి

By telugu teamFirst Published Jul 6, 2020, 12:06 PM IST
Highlights

ఘర్షణ జరిగిన గాల్వన్ వ్యాలీ ప్రాంతం నుంచి చైనా పీపుల్స్ ఆర్మీ కిలోమీటరు మేర వెనక్కి తగ్గింది. కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: భారత, చైనా బలగాలు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న గాల్వన్ నదీ లోయలో వెనక్కి తగ్గాయి. చైనా చేతిలో జూన్ 15వ తేదీన భారత్ కు చెందిన 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. భారత, చైనా బలగాల మధ్య బఫర్ జోన్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోది. 

ఏ మేరకు ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాయనే విషయం కచ్చితంగా తెలియడం లేదు. అయితే, కిలోమీటరు మేర వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని, ఇది న్యాయంగా జరిగిందా లేదా అనేది చూడాల్సి ఉంటుందని అంట్నారు. 

ఇరు వైపుల కూడా తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంనాడు లడఖ్ లో పర్యటించిన విషయం తెలిసిందే. మోడీ పర్యటన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. 

గాల్వన్ వ్యాలీ ఘర్షణ తర్వాత గత వారం ఇరు దేశాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల్లో నియంత్రితక రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. 

వివాదాస్పద స్థలం నుంచి కిలోమీటర్ వెనక్కి చైనా పీపుల్స్ ఆర్మీ వెళ్లింది. ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి చైనా సైన్యాలు వైదోగలిగాయి.

click me!