చైనాలో మళ్లీ కరోనా భయం.. వాళ్లని పట్టుకుంటే రూ.54వేలు నగదు బహుమతి

By telugu news teamFirst Published Apr 16, 2020, 7:52 AM IST
Highlights
కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వైరస్ వ్యాప్తి చెందుతోందని వారు భావిస్తున్నారు. కేవలం మంగళవారం ఒక్కరోజే 78 కేసులు నమోదవ్వడంతో చైనాలో కంగారు మొదలైంది. 
చైనా దేశంలో రెండో దశ కరోనా వైరస్ సోకుతుండటంతో ఆ దేశ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రష్యా సరిహద్దుల్లోని చైనా ఈశాన్య హీలాంగ్జియాంగ్ ప్రావిన్సులో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 

విదేశాల నుంచి వారికి కరోనా వైరస్ సోకుతుండటంతో చైనా అధికారులు రష్యా సరిహద్దును మూసివేశారు. చైనాలో కొత్తగా మరో 108 మందికి కరోనా సోకింది. రష్యా దేశం నుంచి హీలాంగ్జియాంగ్ ప్రావిన్సులోకి ప్రవేశించిన 49 మంది చైనా పౌరులకు కొవిడ్ -19 సోకిందని పరీక్షల్లో తేలింది. 

దీంతో చైనా దేశంలో విదేశాల నుంచి వచ్చిన 1464 మందికి కరోనా వైరస్ సోకడం చైనాలో మొత్తం 82,249 మందికి కరోనా సోకగా, వారిలో 3,341 మంది మరణించారు. రష్యా సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉండటంతోపాటు సమీపంలోనే చైనా నగరాలున్నాయి. దీంతో చైనా రష్యా సరిహద్దును మూసి వేసి కరోనా ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. 

కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వైరస్ వ్యాప్తి చెందుతోందని వారు భావిస్తున్నారు. కేవలం మంగళవారం ఒక్కరోజే 78 కేసులు నమోదవ్వడంతో చైనాలో కంగారు మొదలైంది. 

ఈ క్రమంలో దేశ ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని పట్టుకున్న వారికి నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించారు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వారి ఆచూకీ చెప్పినా.. వారిని పట్టుకున్నా.. చైనా కరెన్సీలో 5000 యువాన్లు( భారత కరెన్సీలో రూ.54వేలు) ఇవ్వనున్నట్లు ప్రకటించడం విశేషం.
click me!