డోనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా సత్యా నాదెళ్ల, సుందర్ పిచాయ్..

By telugu news teamFirst Published Apr 16, 2020, 7:24 AM IST
Highlights
తన అభ్రిప్రాయంలో వీరందరూ వారి వారి రంగాల్లో ప్రతిభా వంతులు, అర్థిక వ్యవస్థను పట్టా లేక్కించేందుకు వారు మనకు కొత్త కొత్త సలహాలు ఇస్తారని ట్రంప్ తెలిపారు.
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేందుకు ఏం చేయాలనే దానిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సలహాలు సూచనలు ఇవ్వ నున్నారు. 



ఈ విషయాన్ని ట్రంప్‌యే స్వయంగా వైట్ హౌజ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ప్రకటించారు. 

అమెరికా ఆర్థిక వ్యవస్థ ను పునరుత్తేజితం చేసేందుకు సిద్ధమైన ట్రంప్.. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికా లోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వ్యవసాయం, బ్యాంకింగ్, నిర్మాణం, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్యం, సేవలు, పారిశ్రామిక రంగం, రిటైల్, టెక్నాలజీ, టెలి కమ్యునికేషన్, రవాణా, తదితర రంగాల అభివృద్ధి కి ఏం చేయాలనే దానిపై అగ్ర రాజ్యాధినేతకు వీరు తమ సూచనలు చేయనున్నారు.

తన అభ్రిప్రాయంలో వీరందరూ వారి వారి రంగాల్లో ప్రతిభా వంతులు, అర్థిక వ్యవస్థను పట్టా లేక్కించేందుకు వారు మనకు కొత్త కొత్త సలహాలు ఇస్తారని ట్రంప్ తెలిపారు.

యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌ బుక్ సీఈఓ మార్క్ జూకర్‌ బర్గ్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వంటి ఎందరో ప్రముఖలు అధ్యక్షుడి సలహాదారులుగా వ్యవహరించనున్నారు. 

సత్యా నాదేళ్ల, సుందర్ పిచాయ్‌ తో పాటూ భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్ట (ఐబీఎమ్), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్). ట్రంప్ టీంలో భారత సంతతికి చెందిన ఆరుగురు ప్రముఖులకు స్థానం లభించింది. 

ఒక్కో రంగం అభివృద్ధికి కోసం ఆయా రంగం లోని నిపుణులు ట్రంప్‌ కు సూచనలు సలహాల రూపంలో తోడ్పాటు నందించనున్నారు.
click me!