2022 వరకు మనిషికి మనిషికి దూరం తప్పదు: హర్వర్డ్ శాస్త్రవేత్తలు

By Siva Kodati  |  First Published Apr 15, 2020, 2:41 PM IST
మూడోవంతు భూగోళాన్ని పట్టుకుని జనాన్ని వణికిస్తున్న కరోనా భయం 2022 వరకు తప్పదని హెచ్చరిస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలు అవలంభిస్తున్న సామాజిక దూరం అనే మంత్రాన్ని మూడేళ్ల పాటు అమలు చేయకతప్పదని వారు చెబుతున్నారు. 

కోవిడ్‌ 19కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఎలా లేదన్నా ఏడాదిన్నర సంవత్సరం పట్టే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ముప్పును అడ్డుకునేందుకు సామాజిక దూరాన్ని పాటించాలని పరిశోధకులు అంటున్నారు.

కరోనా వ్యాప్తి కాస్త తగ్గిన తర్వాత ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తుంది. అయితే ఆ తర్వాత ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తారు. అప్పటికి చాలా మంది కరోనా నుంచి కోలుకుని వుండొచ్చు.

ఒకవేళ వారికి మరోసారి వైరస్ తిరగబెడితే పరిస్ధితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.కరోనా ప్రభావం తగ్గి, లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ 2022 వరకు ప్రజలకు ఖచ్చితంగా సామాజిక, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

లేదంటే ఏ సమయంలోనైనా ఈ వైరస్ తిరిగి మానవాళిపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో కరోనా సీజనల్ వ్యాధిగా మారి.. శీతల ప్రదేశాల్లో, చలి కాలంలో విజృంభించే అవకాశాలు కొట్టిపారేయలేమని వారు చెబుతున్నారు. 
click me!