China Jet Crash: చైనా జెట్ క్రాష్ లో బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. షాకింగ్ సమాచారం వెలుగులోకి..

By Rajesh KFirst Published May 18, 2022, 1:18 AM IST
Highlights

China Jet Crash:  ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో జ‌రిగిన‌ ఘోర విమానం ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ వెలుగులోకి వ‌చ్చింది.  ఈ బ్లాక్ బాక్స్ డీ కోడింగ్ చేస్తే.. సంచ‌న‌ల విష‌యాలు వెలుగులోకి  వ‌చ్చాయి. కాక్‌పిట్‌లో ఎవరో ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కిందికి డైవ్ చేయమని బలవంతం చేశారని ఈ డేటా సూచిస్తుంది.
 

China Jet Crash: చైనాలో (China) ఈ ఏడాది ప్రారంభంలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. కున్మింగ్ నుండి గ్వాంగ్‌జౌకి వెళుతున్న బోయింగ్ 737-800 విమానం గ్వాంగ్జీ పర్వతాలలో కుప్ప కూలిపోయింది. గ్వాంగ్జి ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 123 మంది ప్రయాణికులు మరణించారు. వీరితో పాటు విమానంలో ఉన్న తొమ్మిది మంది భద్రత  సిబ్బంది కూడా చనిపోయారు. ఇది 28 సంవత్సరాలలో చైనా ప్రధాన భూభాగంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదమని అధికారులు తెలిపారు.

ఈ ప్ర‌మాదం నుంచి  రికవరీ చేయబడిన బ్లాక్ బాక్స్ నుండి ఫ్లైట్ డేటా కాక్‌పిట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని డీకొడ్ చేస్తే... విమాన ప్రమాదానికి సంబంధించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా జెట్‌ను క్రాష్ చేసినట్లు తెలుస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ మంగళవారం నివేదించింది. ప్రస్తుతం నివేదిక తీవ్ర దుమారాన్ని రేపింది. విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తులో, ధ్వంసమైన విమానం బ్లాక్ బాక్స్ యొక్క ఫ్లైట్ డేటాను విశ్లేషించినట్లు చెప్పారు. గత మూడు దశాబ్దాల్లో చైనాలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదేన‌ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 

 
కాక్‌పిట్‌లో ఎవరో ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కిందికి డైవ్ చేయమని బలవంతం చేశారని ఈ డేటా సూచిస్తుంది. అయితే, ఎయిర్‌లైన్స్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ నివేదికపై ఇంకా వ్యాఖ్యానించలేదు. ఒక్కసారిగా విమానం నేల కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంట‌లు విస్త‌రించడంతో  బాధితుల రెస్క్యూ కష్టంగా మారింది. సోమవారం మధ్యాహ్నం 1గంట తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన భయానక వీడియో ఫుటేజీని  వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో విమానం ముక్కుకు వరుసలో భూమిపైకి వస్తూ కనిపించింది.
  
టెంగ్ గ్రామీణ ప్రాంతంలోని వుజౌ సమీపంలో విమానం కూలిపోయి పర్వతానికి మంటలు అంటుకున్నాయి. కేవలం 2.15 నిమిషాల వ్యవధిలో విమానం 29 వేల అడుగుల ఎత్తు నుంచి 9,075 అడుగులకు ప‌డిపోయింద‌ని ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 నివేదించింది. తర్వాతి 20 సెకన్లకు 3,225 అడుగుల ఎత్తులో ఉంది, ఆ తర్వాత విమానానంతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా విమాన ప్రయాణంలో అంత ఎత్తు నుంచి కిందకు రావడానికి దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది.

click me!