గాల్వాన్ ఎటాక్.. తొలిసారి నోరు విప్పిన చైనా

By telugu news teamFirst Published Feb 19, 2021, 10:35 AM IST
Highlights

భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన ఐదుగురు అధికారులు, జవాన్లు మరణించారని మొట్ట మొదటి సారి చైనా ఒప్పుకుంది.

గతేడాది లడాఖ్ లోని గాల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై చైనా తొలిసారి స్పందించింది. ఆ ఘర్షణలో ఐదుగురు ఆఫీస‌ర్ల‌తో పాటు  సైనికులు కూడా మృతిచెందిన‌ట్లు చైనా అంగీక‌రించింది.  భార‌త సైనికుల‌తో పాటు చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ మ‌ధ్య ఆ  రోజున హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది.  

భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన ఐదుగురు అధికారులు, జవాన్లు మరణించారని మొట్ట మొదటి సారి చైనా ఒప్పుకుంది. అంతేకాకుండా వారి పేర్లను కూడా చైనా విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన వారికి చైనా సర్కార్ గౌరవ హోదాలను కూడా కల్పించింది. ఈ విషయాన్ని చైనా మీడియానే వెల్లడించింది. మరణించిన వారిలో జిన్జియాంగ్ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంటర్ కమాండర్ క్వి ఫాబావో ఉన్నారు. ఈయనతో పాటు క్విఫాబావో, చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్‌లను చైనా గౌరవించింది.

క‌ర‌కోర‌మ్ ప‌ర్వ‌త‌శ్రేణుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న అయిదురు సైనిక బ‌ల‌గాల‌కు చెందిన వారు మృతిచెందిన‌ట్లు సెంట్ర‌ల్ మిలిట‌రీ క‌మిష‌న్ ఆఫ్ చైనా వెల్ల‌డించింది.  భార‌త్‌తో జ‌రిగిన స‌రిహ‌ద్దు ఘర్ష‌ణ‌లో ఆ అయిదుగురు ప్రాణ‌త్యాగం చేసిన‌ట్లు చైనా పేర్కొన్న‌ది.  గాల్వ‌న్ దాడిలో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. 

తెలంగాణ‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కూడా ఆ ఘ‌ర్ష‌ణ‌లో వీర‌మ‌ర‌ణం పొందారు. అయితే గా‌ల్వాన్ దాడిలో త‌మ ద‌ళాల‌కు చెందిన అయిదుగురు స‌భ్యులు మృతిచెందిన‌ట్లు చైనా తొలిసారి అంగ‌క‌రిస్తూ ఇవాళ ప్ర‌క‌ట‌న చేసింది.  పీఎల్ఏకు చెందిన పత్రిక ఇవాళ త‌న క‌థ‌నంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.  
 

click me!