విమానం ప్రమాదంలో అమెజాన్‌ అడవుల్లో తప్పిపోయిన చిన్నారులు క్షేమం.. కొలంబియా అధ్యక్షుడి ట్వీట్..

By SumaBala BukkaFirst Published May 18, 2023, 12:53 PM IST
Highlights

విమాన ప్రమాదంలో తప్పిపోయిన నలుగురు చిన్నారులు అమెజాన్ అడవుల్లో సజీవంగా దొరికారని కొలంబియా అధ్యక్షుడు ప్రకటించారు.

కొలంబియా : రెండు వారాల క్రితం దట్టమైన కొలంబియా అమెజాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పిపోయిన నలుగురు పిల్లలు సజీవంగా అడవిలో దొరికారు. దట్టమైన కొలంబియా అమెజాన్‌ అడవిలో 11 నెలల శిశువుతో సహా నలుగురు పిల్లలు సజీవంగా కనిపించారని అధ్యక్షుడు గుస్తావో పెట్రో బుధవారం తెలిపారు. ఇది సంతోషకరమైన విషయం అని ప్రకటించారు.

పెట్రో ఈ న్యూస్ ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మిలిటరీ "కష్టతరమైన శోధన ప్రయత్నాల" తర్వాత పిల్లలను కనుగొన్నారు. మే 1న విమానం కూలడంతో అందులో ఉన్న ముగ్గురు పెద్దవారు చనిపోయారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మైనర్లు అప్పటినుంచి కనిపించకుండా పోయారు. వారిని వెతకడానికి అధికారులు స్నిఫర్ డాగ్‌లతో పాటు.. 100 మందికి పైగా సైనికులను మోహరించారు.

ఈ మైనర్లలో 11 నెలల వయస్సు ఉన్న చిన్నారితో సహా 13, 9, 4 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుండి దక్షిణ కాక్వెటా డిపార్ట్‌మెంట్‌లోని అడవిలో తిరుగుతున్నారని పోలీసులు అనుమానించారు.

అంతకుముందు బుధవారం, సాయుధ దళాలు, రెస్క్యూ టీంకు అడవిలో ఒకచోటు.. కర్రలు, కొమ్మలతో నిర్మించిన ఓ షెల్టర్ కనిపించింది. దీంతో చిన్నారులు బతికే ఉన్నారన్న ఆశలు చిగురించాయి. దీంతో వెతుకులాట మరింత తీవ్రతరం చేశారు. 

గుణతిలకపై రేప్ కేసు కొట్టేసిన సిడ్నీ పోలీసులు... టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా వెళ్లి...

సాయుధ దళాలు విడుదల చేసిన ఫోటోలలో, అడవిలో నేలపై ఉన్న కొమ్మల మధ్య కత్తెర, రబ్బర్ బ్యాంగ్ కనిపించాయి. అంతకుముందు చిన్నారుల పాల సీసా, సగం తినిపడేసిన పండు ముక్క దొరికింది.

కొలంబియాలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన శాన్ జోస్ డెల్ గువియారే అడవిలో సోమ, మంగళవారాల్లో పైలట్, ఇద్దరు పెద్దల మృతదేహాలను సైనికులు కనుగొన్నారు. చనిపోయిన ప్రయాణీకులలో ఒకరైన రానోక్ ముకుటుయ్, హుయిటోటో జాతికి చెందిన వ్యక్తి. ఆమె నలుగురు పిల్లలకు తల్లి.

విమానం పడిపోయిన ప్రదేశం.. 40 మీటర్ల ఎత్తు వరకు పెరిగే పెద్ద చెట్లు, అడవి జంతువులు, భారీ వర్షపాతం ఉన్న కష్టతరమైన ప్రాంతం. దీంతో  "ఆపరేషన్ హోప్" అనే ఈ రెస్క్యూకష్టతరం అయ్యింది. వీరిని రక్షించడానికి మూడు హెలికాప్టర్లు ఉపయోగించారు. వాటిలో ఒకటి హుయిటోటో భాషలో పిల్లల అమ్మమ్మ చెబుతున్న వాయిస్ తో చక్కర్లు కొట్టింది. అందులో అడవిలోపలికి వెళ్లడం ఆపమని ఆమె చెప్పే రికార్డ్ సందేశాన్ని ప్లే చేసుకుంటూ వెళ్లింది. 

విమాన ప్రమాదానికి కారణమేమిటో అధికారులు వెల్లడించలేదు. రాడార్‌ల నుండి విమానం అదృశ్యం కావడానికి కొద్ది నిమిషాల ముందు పైలట్ ఇంజిన్‌లో సమస్యలను వచ్చాయని కొలంబియా విపత్తు ప్రతిస్పందన సంస్థ తెలిపింది.

ఈ ప్రాంతానికి రోడ్డు మార్గం ఉంది కానీ.. నది ద్వారా ప్రయాణించినా దీన్ని చేరుకోవడం కష్టం. కాబట్టి విమాన రవాణా ఇక్కడ సర్వసాధారణం. హుయిటోటో వీరిని విటోటో అని కూడా పిలుస్తారు, వీరు మారుమూల అడవితో సామరస్యంగా జీవిస్తారు. వేట, చేపలు పట్టడం, అడవిలో దొరికే వాటిని సేకరించే నైపుణ్యాలు పిల్లల మనుగడకు సహాయపడతాయి.

దోపిడీ దొంగలు, వ్యాధులు.. నాగరికత.. అనేక దశాబ్దాలుగా జనాభాను బాగా తగ్గించాయి. పిల్లల రెస్క్యూను ప్రకటించిన పెట్రో, కొలంబియా మొదటి వామపక్ష అధ్యక్షుడు. గత ఆగస్టులో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన కార్మిక చట్టం, ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు,  న్యాయవ్యవస్థలో ప్రాథమిక సంస్కరణలను తీసుకురాలేకపోయారు.

click me!