జూమ్ యాప్ లో మీటింగ్.. నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ..!

Published : May 29, 2021, 03:14 PM IST
జూమ్ యాప్ లో మీటింగ్.. నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ..!

సారాంశం

తాజాగా కెనడాకు చెందిన ఎంపీ నగ్నంగా వీడియోలో దర్శనమిచ్చాడు. కెనడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టస్తోంది. తర్వాత సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాడు.   

కరోనా మహమ్మారి ఎంటరైన తర్వాత.. అన్ని ప్రభుత్వ,ప్రైవేటు కార్యక్రమాలన్నీ ఆన్ లైన్ కే పరిమితమయ్యాయి. దాదాపు మీటింగ్స్ అన్నీ జూమ్ యాప్ లోనే నిర్వహిస్తున్నారు. కాగా..  కెనడాలో ఓ ఎంపీ జూమ్ యాప్ లో నగ్నగా కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఆయన చేసిన నిర్వాకం అందరినీ నివ్వరపోయేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 కరోనా కారణంగా జూమ్ యాప్ వినియోగం ఎక్కువైన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఆన్ లైన్‌లో దర్శనమిస్తున్నాయి. తాజాగా కెనడాకు చెందిన ఎంపీ నగ్నంగా వీడియోలో దర్శనమిచ్చాడు. కెనడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టస్తోంది. తర్వాత సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాడు. 

క్యూబెక్స్ ప్రావిన్స్‌కు చెందిన లిబరల్ పార్టీ ఎంపీ విలియం ఆమోస్ ఈ చర్యకు పాల్పడ్డాడు. జాగింగ్‌కి వెళ్లి వచ్చిన తాను డ్రెస్ మార్చుకుంటుండగా.. పొరపాటున కెమేరా ఆన్ అయ్యిందని వివరణ ఇచ్చుకున్నాడు విలియం. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో సమావేశాలకు దూరంగా ఉంటానని ట్వీట్ చేశాడు. అయితే విలియం ఇలా జూమ్‌లో కనిపించడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ కనిపించి విమర్శల పాలయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే