
టొరంటో : కెనడా ప్రధాని Justin Trudeauకు corona positive సోకింది. అయితే తనకు బాగానే ఉందని trudeau సోమవారం ప్రకటించారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. పబ్లిక్ హెల్త్ నిబంధనలు పాటిస్తూ వారం రోజుల పాటు దూరంగా ఉంటూనే పని చేస్తానని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ట్విట్టర్ లో తెలిపారు.
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. గత రెండేళ్లుగా కరోనా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దేశంలో ఇంకా కరోనాతో పోరాటం ముగిసిపోలేదు గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో కొంతమంది చేస్తున్న నిరసన బాధాకరమని తెలిపారు. అలాంటి ప్రవర్తనకు దేశంలో చోటు లేదని ఓ రహస్య ప్రాంతం నుంచి ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు.
దేశంలో ప్రజల నిరసనల నేపథ్యంలో ప్రధాని ట్రూడో.. భార్యా పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసింది. ఇప్పటికీ ఆయన ఎక్కడున్నారు అనే విషయం తెలియ రాలేదు. జస్టిన్ ట్రూడో పై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. కెనడా దేశంలో కరోనా వాక్సిన్ తప్పనిసరి చేయడం మీద అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రజలు పెద్ద ఎత్తున ప్రధాని నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్లారు.
ఇదిలా ఉండగా, రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడిలో భాగంగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కెనడా కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలు.. అనుహ్య పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళకు దిగారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విధించిన కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ Freedom Convoy పేరుతో ట్రక్కు డ్రైవర్లు కెనడా రాజధాని ఒట్టావాను చుట్టుముట్టారు.
జనవరి 30, శనివారం ఒట్టావాలో వేలాది మంది ట్రక్కర్లు గుమిగూడి US సరిహద్దును దాటడానికి వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒట్టావాలోని Parliament Hill వైపుకు వేలాది మంది నిరసనకారులు దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులను రహస్య ప్రదేశానికి తరలించినట్టుగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టే ప్రమాదం ఉండంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆందోళన విషయానికి వస్తే కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కోవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని కోరుతూ రాజధాని నగరంలోకి దూసుకొచ్చిన ట్రక్కర్లకు వేలాది మంది నుంచి మద్దతు లభించింది. నిరసనకారుల్లో వృద్దులు, పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది నిరసనకారులు ప్రముఖ యుద్ధ స్మారక చిహ్నంపై నృత్యం చేయడం కనిపించింది.ఈ చర్యలను కెనడా సైనికాధికారి జనరల్ వేన్ ఐర్, కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ ఖండించారు.