Russia Ukraine Crisis: రష్యా దాడిని ఉక్రెయిన్ అడ్డుకోగలదా? ఇరు దేశాల బలబలాలెంత‌?

Published : Feb 24, 2022, 01:32 PM ISTUpdated : Feb 24, 2022, 09:00 PM IST
Russia Ukraine Crisis: రష్యా  దాడిని ఉక్రెయిన్ అడ్డుకోగలదా? ఇరు దేశాల బలబలాలెంత‌?

సారాంశం

Russia Ukraine Crisis: రష్యా దాడిని ఉక్రెయిన్ అడ్డుకోగలదా? రెండు దేశాల మధ్య ఆయుధ సంపత్తి ఎంత ఉంది? ఇరు దేశాల వ‌ద్ద‌ ఆయుధాలు ఎన్ని ఉన్నాయి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బ‌ల‌బ‌ల‌గాలెంత?  ఉందో తెలుసుకుందాం.. మీ కోసం..    

Russia Ukraine Crisis:  ప్ర‌పంచ దేశాలు భయపడినట్టే.. ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం మొదలైంది. ర‌ష్యా ..ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగింది. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలను టార్గెట్ చేసుకుని.. రష్యా దాడి చేస్తుంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్ కేపిటల్‌ కీవ్‌తోపాటు 20కి పైగా నగరాలపై బాంబుల దాడి చేస్తున‌ట్టు తెలుస్తుంది.  ఈ తరుణంలో గంట‌కో న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ర‌ష్యా తొలుత ఉక్రెయిన్ సైనిక స్థావరాల‌పై దాడి చేసింది. అనంత‌రం నివాస ప్రాంతం దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 300 మంది చ‌నిపోయిన‌ట్టు ఉక్రెయిన్ తెలిపింది. 

ఈ త‌రుణంలో ర‌ష్యా త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థించుకుంటుంది. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని  అమెరికా సహా నాటో దేశాలకు పరోక్షంగా పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఈ త‌రుణంలో ఉక్రెయిన్ కూడా  ఏ మాత్రం త‌గ్గేదేలే.. అన్న‌ట్టు ప్ర‌తిదాడికి దిగింది. ఉక్రెయిన్ కు అండ‌గా.. నాటో దేశాలు నిలిచాయి. ఉక్రెయిన్ ప్ర‌తి దాడిలో ఐదు రష్యన్ యుద్ద‌ విమానాలు, ఒక రష్యన్ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది. 
 


ఈ క్ర‌మంలో రష్యా దండయాత్రను ఉక్రెయిన్ అడ్డుకోగలదా? రెండు దేశాల మధ్య ఆయుధ సంపత్తి ఎంత ఉంది? ఆయుధాలు ఎన్ని ఉన్నాయి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బ‌ల‌బ‌ల‌గాలెంత?  ఉందో తెలుసుకుందాం? 

గ్లోబల్ ఫైర్‌పవర్ 2021, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS) లండన్‌ ప్రకారం.. రష్యా బలం ఉక్రెయిన్ కంటే ఎక్కువ. కాబట్టి, ఉక్రెయిన్ కు నాటో మద్దతు చాలా కీల‌కం. రష్యాలో 30,14,000 మంది సైనికులు ఉండగా అందులో 10,14,000 యాక్టివ్ సైనికులు ఉండ‌గా.. ఉక్రెయిన్‌లో 11,55,000 మంది సైనికులు అందులో  2,55,000 యాక్టివ్ సైనికులు ఉన్నారు. ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యా వద్ధే యుద్ధ సామాగ్రి ఎక్కువేన‌ని చెప్పాలి. అదే సమయంలో అమెరికా, యూకే, కెనడా నుంచి ఈ మధ్య ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేసే అవ‌కాశం కూడా ఉంది. 
 

గత దశాబ్దకాలంలో రష్యా మిలటరీ బడ్జెట్ ఖర్చు 30 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఉక్రెయిన్ మిలటరీ బడ్జెట్ కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యా డిఫెన్స్ బడ్జెట్ 15 రెట్లు ఎక్కువ. ర‌ష్యాకు 13,367 యుద్ధ ట్యాంక్ లు ఉండ‌గా..  ఉక్రెయిన్ కు 2,119 యుద్ధ ట్యాంక్‌లు ఉన్నాయి. అలాగే.. రష్యా ద‌గ్గ‌ర 5934 ఫిరంగులుండ‌గా.. ఉక్రెయిన్ ద‌గ్గ‌ర కేవ‌లం 1,962 ఫిరంగులున్నాయి. రష్యా కు 19,783 ఆయుధ వాహ‌నాలుండ‌గా..   ఉక్రెయిన్ ద‌గ్గ‌ర కేవ‌లం 2,870  ఆయుధ త‌ర‌లింపు వాహ‌నాలున్నాయి. ఈ అంచ‌నా ప్ర‌కారం .. ఉక్రెయిన్ కంటే రష్యా వద్ద యుద్ధ ట్యాంక్‌లు ఆరు రెట్లు ఎక్కువ, ఆయుధాలు కలిగిన వాహనాలు 7 రెట్లు అధికం, ఫిరంగులు మూడు రెట్లు ఎక్కువ.

ఎయిర్ ఫోర్స్‌లో విష‌యానికి వ‌స్తే.. రష్యా ద‌గ్గ‌ర 1,65,000 ఎయిర్ ఫోర్స్ ట్రూప్స్ ఉండ‌గా..  ఉక్రెయిన్ ద‌గ్గ‌ర కేవ‌లం 35,000 ఎయిర్ ఫోర్స్ ట్రూప్స్ ఉన్నాయి. అలాగే.. ర‌ష్యా ద‌గ్గ‌ర 1,328 ఎటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉండ‌గా..  ఉక్రెయిన్ ద‌గ్గ‌ర కేవ‌లం 146 ఎటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ అంచ‌నా ప్ర‌కారం  ఎయిర్‌ఫోర్స్‌లో ఉక్రెయిన్ కన్నా రష్యా పది రెట్లు ఎక్కువ బ‌లం ఉంది.  

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి