నా బాత్రూమ్ లో కెమేరాలు పెట్టారు.. మాజీ సీఎం కుమార్తె

By telugu news teamFirst Published Nov 13, 2020, 3:12 PM IST
Highlights

ఇమ్రాన్ ఖాన్  ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్ట్‌ చేసి, వ్యక్తిగతంగా దాడి చేశారంటే  ఇక పాకిస్తాన్‌లోని ఏ మహిళకు రక్షణ లేనట్లే అని వ్యాఖ్యానించారు. 

తనను నిర్భందించిన గదితోపాటు.. బాత్రూమ్ లో కూడా కెమేరాలు ఏర్పాటు చేసినట్లు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఉపాధ్యక్షురాలు, పాక్ మాజీ సీఎం కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ఆరోపించారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో నవాజ్‌ షరీఫ్ గతేడాది అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

 ఇటీవల పాకిస్తాన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు.  తాను రెండుసార్లు జైలు జీవితం గడిపానని,ఈ సందర్భంగా ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది. ఓ మహిళగా తనతో ఎలా వ్యవహరించారు అన్నదానిపై మాట్లాడితే, వారికి ముఖాలు చూపించే ధైర్యం కూడా ఉండదంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్  ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్ట్‌ చేసి, వ్యక్తిగతంగా దాడి చేశారంటే  ఇక పాకిస్తాన్‌లోని ఏ మహిళకు రక్షణ లేనట్లే అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ లేదా మరెక్కడైనా మహిళలు బలహీనులు కాదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది.

 ప్రస్తుత  ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తే, రాజ్యాంగ పరిధిలో సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ సిద్దమేనన్నారు. తాను వ్యవస్థలకు వ్యతిరేకం కాదని, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పిడిఎం) వేదిక ద్వారా  చర్చలకు సిద్ధమని పునరుద్ఘాటించింది.  

మనీలాండరింగ్‌, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్‌తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్‌తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, 54 కెనాల్ ల్యాండ్ కేసులో నవాజ్ షరీఫ్, జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. 

click me!