ఏదో ఒకటి పిక్ అవ్వకపోతుందా అనే ఆశ ఉంటుంది. ఓ వ్యక్తి కూడా ఇలానే రెగ్యూలర్ గా లాటరీలు వేసి, చివరకు జాక్ పాట్ కొట్టేశాడు. అతనిని అదృష్ట దేవత వరించింది.
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కసారి అదృష్టం వరిస్తే మాత్రం జీవితం మొత్తం మారిపోతుంది. తాజాగా ఓ వ్యక్తి జీవితం అలానే మారిపోయింది. రాత్రికి రాత్రే ఓ వ్యక్తి మిలీనియర్ అయిపోయాడు. ప్రపంచంలో కెల్లా రెండో అతిపెద్ద జాక్ పాట్ అతను గెలుచుకున్నాడు. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చాలా మందికి లాటరీలు వేసే అలవాటు ఉంటుంది. రెగ్యులర్ గా లాటరీ వేయడం వల్ల, ఏదో ఒకటి పిక్ అవ్వకపోతుందా అనే ఆశ ఉంటుంది. ఓ వ్యక్తి కూడా ఇలానే రెగ్యూలర్ గా లాటరీలు వేసి, చివరకు జాక్ పాట్ కొట్టేశాడు. అతనిని అదృష్ట దేవత వరించింది.
అమెరికా(USA) కి చెందిన ఓ వ్యక్తికి ఎవరూ కలలో కూడా ఊహించలేని మొత్తం లాటరీలో దక్కింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద లాటరీగా పేరుగాంచిన పవర్ బాల్ లాటరీని(Powerball) అతడు గెలుచుకున్నాడు. అతడు గెలుచుకున్న సొమ్ము 1.73 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ.14,400 కోట్లు!