కాలిఫోర్నియాలో కార్చిచ్చు వేగం.. నిమిషానికి 80 ఫుట్‌బాల్ గ్రౌండ్ల అడవి ఆహుతి

By sivanagaprasad kodatiFirst Published Nov 9, 2018, 2:13 PM IST
Highlights

ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతోంది. అత్యంత వేగంగా కదులుతూ అడవిని దహించి వేస్తోంది. నిపుణులు సైతం దీని వేగాన్ని అంచనా వేయలేకపోతున్నారు

ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతోంది. అత్యంత వేగంగా కదులుతూ అడవిని దహించి వేస్తోంది. నిపుణులు సైతం దీని వేగాన్ని అంచనా వేయలేకపోతున్నారు..

విశ్లేషణ ప్రకారం.. ఇది నిమిషానికి 80 ఫుట్‌బాల్ మైదానాల సైజు పరిమాణంలో అడవిని మింగేస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు రేగిన కార్చిచ్చు... అత్యంత వేగంగా విస్తరిస్తోంది...నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయానికి సుమారు 18,000 ఎకరాల్లో అడవి దగ్థమైంది. 

హెలికాఫ్టర్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది ఫైరింజిన్లు కార్చిచ్చును నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాలిఫోర్నియా ప్రభుత్వం బుట్టే కౌంటిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మంటలకు గాలి తోడుకావడంతో పుల్గా, కోన్‌కోవ్ ప్రాంతాలలోని 26,000 మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

click me!