క్యాడ్బరీ చాకొలేట్ డిజర్ట్స్‌ వెనక్కివ్వాలని వార్నింగ్.. లిస్టీరియా బ్యాక్టీరియా భయాలు

By Mahesh KFirst Published May 2, 2023, 6:35 PM IST
Highlights

యూకేలో ఓ బ్యాచ్ క్యాడ్బరీ ఉత్పత్తులపై లిస్టీరియా బ్యాక్టీరియా ఏర్పడి ఉందనే భయాలతో ఉత్పత్తులను వెనక్కి ఇచ్చి రిఫండ్ పొందాలని ఓ సూపర్ మార్కెట్ చైన్ ముల్లర్ పేర్కొంది. లిస్టీరియా బ్యాక్టీరియా ఆహార పదార్థాలపై ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుంది. గర్భిణీలకు ప్రమాదకరం.
 

న్యూఢిల్లీ: యూకేలో వేలాది క్యాడ్బరీ ఉత్పత్తులను వెనక్కి ఇచ్చేయాలని ఓ వార్నింగ్ ఇచ్చారు. ఓ బ్యాచ్‌కు చెందిన ప్రాడక్టులు అన్నీ కూడా స్టోర్‌లో ఇచ్చేయాలని, దానిపై లిస్టీరియా బ్యాక్టీరియా ఫామ్ అయిన అనుమానాలు ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేశారు. వాటిని తినవద్దని, వెనక్కి ఇచ్చి రిఫండ్ పొందాలని పేర్కొన్నట్టు స్కై న్యూస్ ఓ కథనం ప్రచురించింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ప్రకారం, లిస్టీరియా ఇన్ఫెక్షన్ ఆహార పదార్థాలపై ఏర్పడుతుంది. బ్యాక్టీరియం లిస్టీరియా మోనోసైటోజెన్స్ ఏర్పడిన ఆహార పదార్థాలు తినడం వల్ల బ్యాక్టీరియల్ అనారోగ్యం బారిన పడతారు.

గర్భిణీలు, 65 ఏళ్లకు పైబడిన వారికి ఈ ముప్పు తీవ్రంగా ఉంటుంది. వారి రోగ నిరోధక శక్తిపై ఈ బ్యాక్టీరియా దాడి చేస్తుంది. అందుకే ఆ క్యాడ్బరీ ఉత్పత్తుల ఎక్స్‌పైరీ డేట్‌లను చెక్ చేయాలని వినియోగదారులకు యూకే ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ పేర్కొంది.

క్రంచీ, డైమ్, ఫ్లేక్, డైరీ మిల్క్ బటన్స్, డైరీ మిల్క్ చంక్స్ 75 గ్రాముల చాకొలేట్, డిజర్ట్‌లు, ఇతర అన్ని ఉత్పత్తులు సూపర్ మార్కెట్‌లలో విక్రయించారని స్కై న్యూస్ రిపోర్ట్ చేసింది.

వీటి యూజ్ బై డేట్ ఈ నెల 17వ తేదీ, 18వ తేదీలతో ముగుస్తున్నదని తెలిపింది.

Also Read: Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రాజీనామా పై అజిత్ పవార్ ఏమన్నారంటే?

ముల్లర్ అనే సూపర్ మార్కెట్ ఈ క్యాడ్బరీ ఉత్పత్తులను వెనక్కి తెచ్చి డబ్బులు తీసుకోవాలని పేర్కొన్నట్టు మెట్రో అనే మీడియా సంస్థ తెలిపింది. 

కొన్ని బ్యాచ్‌ల ఉత్పత్తులపై లిస్టీరియా మోనోసైటోజెన్స్ ఏర్పడి ఉండే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి, వాటిని వెనక్కి ఇవ్వాలని పేర్కొన్నట్టు  ఎఫ్ఎస్ఏ ఓ ప్రకటనలో వివరించింది.

లిస్టీరియా లక్షణాలు ఫ్లూను పోలే ఉంటాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, డయే రియా వంటి లక్ష ణాలు ఉంటాయని సీడీసీ తెలిపింది. దీని ద్వారా గర్భిణీలకు గర్భస్రావ ముప్పు ఏర్పడుతుందని వివరిం చింది.

click me!