ప్లాస్టిక్ సర్జరీ తెచ్చిన తంటా.. కుర్రాడిలా కనిపించాలనుకుంటే.. కళ్లు మూయలేక నరకం చూస్తున్నాడు..

By SumaBala BukkaFirst Published Jan 25, 2022, 12:26 PM IST
Highlights

పీట్ బ్రాడ్ హార్ట్స్.. ఎలాగైనా అందంగా కనిపించాలనుకున్నాడు. 2019లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. దీనికి బర్మింగ్ హంలోని   బిఎ ఐ ఆస్పత్రి వేదికయ్యింది. అక్కడి వైద్యులు 9 గంటల పాటు సర్జరీ చేశారు. 11 వేల పౌండ్లు (దాదాపు సుమారు రూ. 11 లక్షలు) బిల్లు వేశారు. సర్జరీ అయిన వెంటనే పీట్ కు ముఖంపై ఎవరు కొట్టినట్టు అనిపించింది.
 

ఇంగ్లండ్ : Englandలో యువకుడిలా కనిపించాలన్న ఓ వృద్ధుడి ఆశ.. చివరికి అతడికి తేరుకోలేని జీవిత కాల సమస్యలు తెచ్చిపెట్టింది. ఎప్పటికీ కనురెప్పలు మూయలేని విధంగా మార్చేసింది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ కు చెందిన పీట్ బ్రాడ్ హార్ట్స్ (79) కొన్నేళ్ల క్రితం పళ్లకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ సర్జరీ వల్ల అతడి బుగ్గల రూపం మారిపోయింది. దీంతో ‘అందంగా లేవు’ అంటూ భార్య అతన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయింది.  

దీంతో విసుగెత్తిన  Pete Broad Hearts.. ఎలాగైనా అందంగా కనిపించాలనుకున్నాడు. 2019లో Plastic surgery చేయించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. దీనికి బర్మింగ్ హంలోని బిఎఐ ఆస్పత్రి వేదికయ్యింది. అక్కడి వైద్యులు 9 గంటల పాటు సర్జరీ చేశారు. 11 వేల పౌండ్లు (దాదాపు సుమారు రూ. 11 లక్షలు) బిల్లు వేశారు. సర్జరీ అయిన వెంటనే పీట్ కు ముఖంపై ఎవరు కొట్టి నట్టు అనిపించింది.

కళ్ళు మూయలేకపోతున్నానన్న భావన కలిగింది. కుట్లు తీయించుకునేందుకు రెండు వారాల తర్వాత ఆస్పత్రికి వెళ్లాడు. కళ్ళలో మంటగా ఉందని, తరచూ నీరు కారుతోందని వైద్యులకు చెప్పాడు. వాళ్ళు పట్టించుకోలేదు. మరో ఆస్పత్రికి వెళ్లగా..  పరిశీలించిన వైద్యులు.. అతనికి కనురెప్పలు సరిగా మూసుకోవడం లేదని గుర్తించారు. పీట్ వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేసిన ఆస్పత్రికి వెళ్లాడు. బుగ్గలు, కనురెప్పలు కలిసేచోట చర్మంలో ఇబ్బంది ఉందని చెప్పిన వైద్యులు ఉచితంగా మరో సర్జరీ చేశారు. 

దీని తర్వాత పీట్ కళ్లు అసలు మూతపడడం లేదు. కళ్ల మంట  తగ్గించుకునేందుకు రోజుకు ఎనిమిది సార్లు ఐడ్రాప్స్ వేసుకోవడం తప్పనిసరి. నిద్ర పోవాలంటే చిన్నపాటి టవల్ ను కళ్లచుట్టూ చుట్టుకోవాలి.  లేదంటే కళ్ళకు టేప్ అతికించుకోవాలి. రెండేళ్ల నుంచి ఇలా నరకం అనుభవిస్తున్నాడు. పీట్ కు మరోసారి సర్జరీ చేసేందుకు యూకేలోని ఏ ఒక ఆసుపత్రి ఒప్పుకోలేదు. చివరకు అతని టర్కీ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు.  సమస్య కాస్త తగ్గినా.. ఎడమ కంటిని ఇప్పటికీ మూయలేకపోతున్నాడు.

click me!