WHO: కరోనా చివరి దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. కొన్ని కీలక లక్ష్యాలను చేరుకుంటే ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్ దశ ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని అంచనా వేసింది.
WHO: కరోనా చివరి దశలో ఉన్నామనీ, ఒమిక్రాన్ వేరియంటే చివరిదని భావించటం చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, భవిష్యత్తులో కొత్త వేరియంట్లు అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో టెడ్రోస్ అధ్నామ్ మాట్లాడుతూ.. రెండు నెలల కింద్ర ఒమిక్రాన్ వేరియెంట్‌ని గుర్తిస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారని తెలిపారు. 2020 ఏడాది మొత్తంగా నమోదైన కేసుల కంటే ఇది ఎక్కువని చెప్పుకోచ్చారు. కరోనా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉందనీ, దేశదేశాన్ని బట్టి మారుతోందని టెడ్రోస్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికల్లా కోవిడ్–19 అత్యవసర పరిస్థితి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా కృషి చేస్తే కరోనా తుది దశకు చేరుకుంటామన్నారు. అయితే.. డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన నియమాల ఆధారంగా ఈ మహమ్మారికి ముగింపు పలుకొచ్చని సూచించింది.
undefined
ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని, మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు హెచ్చరించించింది డబ్యూహెచ్ ఓ.
పొగాకు వినియోగం తగ్గింపు, యాంటీమైక్రోబయల్ ట్రీట్‌మెంట్‌లకు వ్యతిరేకంగా పోరాడడం, మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రమాదాలు వంటి కీలక అంశాల్లో సాధించిన విజయాలు, ఆందోళనలను వెల్లడించారు. ప్రస్తుత కరోనా దశకు చేరుకుంది.. దేశాలు కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నారు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్. గ్లోబల్ ఎమర్జెన్సీగా కొవిడ్-19కు ముగింపు పలకొచ్చు. ప్రతి దేశంలో 70 శాతం మందికి టీకా అందించటం, అధిక రిస్క్ ఉన్న ప్రజలపై దృష్టి సారించటం, పరీక్షల సామర్థ్యాన్ని పెంచటం, కొత్త వేరియంట్లు నిశితంగా పరిశీలించటం వంటి డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యాలను చేరుకోవటం ద్వారా ఈ ఏడాదే చేయొచ్చునని టెడ్రోస్ అధనోమ్ అన్నారు.
మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. భవిష్యత్లో కరోనాతో కలిసి జీవిస్తామనేది నిజమని టెడ్రోస్ అన్నారు. అయితే.. కరోనాతో కలిసి జీవించటం అంటే దానిని వదిలేయటం కాదని, వారానికి దాదాపు 50వేల మరణాలు సంభవించేందుకు ఆస్కారం కల్పించటం కాదన్నారు. డబ్ల్యూహెచ్ఓను బలోపేతం చేయాలని, తగిన నిధులను సమకూర్చాలని ప్రపంచ దేశాలను కోరారు.