బ్రిటన్‌లో కరోనా విజృంభణ: రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ ఎంతో తెలుసా?

By narsimha lodeFirst Published Sep 20, 2020, 2:33 PM IST
Highlights

కరోనాను అరికట్టేందుకు గాను  బ్రిటన్ ప్రభుత్వం కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది.  కరోనా రూల్స్ ను బ్రేక్ చేస్తే రూ. 10 లక్షల జరిమానాను విధించనున్నట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది


లండన్: కరోనాను అరికట్టేందుకు గాను  బ్రిటన్ ప్రభుత్వం కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది.  కరోనా రూల్స్ ను బ్రేక్ చేస్తే రూ. 10 లక్షల జరిమానాను విధించనున్నట్టుగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.బ్రిటన్ లో కరోనా రెండో దశ ప్రారంభమైంది. దీంతో రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

కరోనా సోకిన వారు... కరోనా అనుమానిత లక్షణాలున్న వారంతా ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రం సూచించినవారంతా ఇంటికే పరిమితం కావాలని సూచించింది.

దీని కోసం ప్రత్యేకంగా కొత్త నిబంధనలను రూపొందించారు. ఫ్రాన్స్, స్పెయిన్ , యూరప్ లలో కూడ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వైద్యాధికారులు ప్రకటించారు.యూకేలో ఇప్పటివరకు 3 లక్షల 93 వేల మందికి కరోనా సోకింది. వీరిలో 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగా విధించిన కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేస్తే పదివేల పౌండ్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారంగా రూ. 10 లక్షలు) జరిమానాను విధించనున్నారు.కరోనా వచ్చినవారంతా 14 రోజులు ఐసోలేషన్ లోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 28వ తేదీ నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

click me!