రక్తమోడిన న్యూయార్క్: ఆందోళనకారులపై కాల్పులు.. 12 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 19, 2020, 06:01 PM IST
రక్తమోడిన న్యూయార్క్: ఆందోళనకారులపై కాల్పులు.. 12 మంది దుర్మరణం

సారాంశం

అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. నల్లజాతీయులపై వివక్షను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. 

అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. నల్లజాతీయులపై వివక్షను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలవ్వగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. న్యూయార్క్ సమీపంలోని రోచెస్టర్‌లో శుక్రవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో ( భారత కాలమానం ప్రకారం శనివారం 10-11 గంటల మధ్య ) కాల్పులు  చోటు చేసుకున్నాయి.

రోచెస్టర్‌లో నల్లజాతీయులపై వివక్షకు నిరసనగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమం అర్థరాత్రి వరకు ఈ నిరసన కొనసాగింది. ఆ క్రమంలోనే కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు ఆందోళన కొనసాగుతుండగానే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?