పెరుగుతున్న కరోనా కేసులు.. 20సెకన్ల టెస్టుకి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్

By telugu news teamFirst Published Mar 27, 2021, 7:53 AM IST
Highlights

తమ 20 సెకన్ల కరోనా టెస్టుకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ టెస్టు పంపిణీదారు  ప్రకటించారు. 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇక వీడినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ.. అలా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. ఈ కరోనా ప్రభావం బ్రిటన్ లో సైతం తీవ్రంగా ఉంది. దీంతో.. కరోనాను అరికట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే కరోనా టెస్టులు చేయడంలో కొత్త విధానానికి ఇక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విధానంలో కరోనా టెస్టు చేయడానికి కేవలం 20 సెకన్లు మాత్రమే పడుతుంది. తమ 20 సెకన్ల కరోనా టెస్టుకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ టెస్టు పంపిణీదారు  ప్రకటించారు. 

విరోలెన్స్ టెస్టు అని పిలిచే ఈ కరోనా పరీక్షను విమానాశ్రయాలు, క్రీడామైదానాలు వంటి ప్రదేశాల్లో ఉపయోగించవచ్చని వాళ్లు తెలిపారు. స్వాబ్స్‌తో ఉమ్మిని తీసుకొని ఈ పరీక్ష చేస్తారట. ఈ టెస్టును హిస్టేట్ అనే సంస్థ బ్రిటన్‌లో పంపిణీ చేస్తోంది. ఆ కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం, ఈ టెస్టుకు 98.1 శాతం సెన్సిటివిటీ, 99.7 శాతం స్పెసివిసిటీ ఉందట. అంటే ఇది చాలా తక్కువగా తప్పుడు రిజల్టులు చూపుతుందన్నమాట.

click me!