మరికాసేపట్లో పెళ్లి... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వధువు..!

Published : Nov 02, 2022, 09:51 AM IST
 మరికాసేపట్లో పెళ్లి... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వధువు..!

సారాంశం

ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది తెలిసి.. పెళ్లికి వచ్చిన బంధువులంతా షాకయ్యారు. ఈ సంఘటన నెదర్లాండ్స్ లోని డోడ్రెచ్ట్ పరిధిలో చోటుచేసుకుంది. 

వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దపడ్డారు. పెళ్లి చాలా గ్రాండ్ గా చేసుకోవాలని వారు భావించారు. అనుకున్నట్లే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు అందరినీ ఆహ్వానించారు. మరి కాసేపట్లో పెళ్లి అనగా.. కడుపులో నొప్పితో వధువు అల్లాడిపోయింది. దీంతో.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది తెలిసి.. పెళ్లికి వచ్చిన బంధువులంతా షాకయ్యారు. ఈ సంఘటన నెదర్లాండ్స్ లోని డోడ్రెచ్ట్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

నెదర్లాండ్స్ కి చెందిన నికోల్, మార్క్ లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారు తమ పెద్దలను ఒప్పించి అక్టోబర్ 26వ తేదీన పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అనుకున్నట్లే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశారు. మరి కాసేపట్లో పెళ్లి అనగా.. వధువుకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆస్పత్రికి తరలించగా.. పండంటి బిడ్డ జన్మించింది. బిడ్డ పుట్టడంతో వరుడు ఆనందంతో గంతులు వేశాడు. ఆమె పెళ్లి కి ముందే గర్భం దాల్చంది. అయితే.. డెలివరీకి ఇంకా ఐదు వారాలు గడువు ఉంది. కానీ.. ఈలోపే బిడ్డ జన్మించడం విశేషం. కాగా... మండపంలో జరపాల్సిన పెళ్లిని... బిడ్డ పుట్టిన ఆనందంలో.. అదే ఆస్పత్రిలో వారు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడం విశేషం దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?