తొమ్మిది మంది యువతులను పెళ్లి చేసుకున్న బ్రెజిల్ మోడల్.. దానికి టైం టేబుల్ సెట్ చేసుకున్నా కుదర్లేదంటా..!

Published : Apr 28, 2022, 08:11 PM IST
తొమ్మిది మంది యువతులను పెళ్లి చేసుకున్న బ్రెజిల్ మోడల్.. దానికి టైం టేబుల్ సెట్ చేసుకున్నా   కుదర్లేదంటా..!

సారాంశం

ఓ బ్రెజిల్ మోడల్ ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా తొమ్మిది మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, వారందరినీ సమానంగా చూసుకోవాలనుకున్నాడు. వారందరితోనూ సమానంగా కాలాన్ని గడపాలనుకున్నాడు. అందరినీ లైంగికంగా సంతృప్తి పరచాలనుకున్నాడు. ఇందుకోసం వారందరితో శారీరకంగా కలవడానికి టైం టేబుల్ పెట్టుకున్నాడు. కానీ, అది వర్కౌట్ కాలేదని చెప్పాడు.  

న్యూఢిల్లీ: ఆ బ్రెజిల్ మోడల్‌ జీవితంలో విలాసాలకు కొదవలేదు. ప్రొఫెషన్‌తోపాటు వ్యక్తిగతంగానూ ఆయన ఆ విలాసాలు కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా ఆయన జీవితంలో ఆడవాసన విషయంలో ఎంతమాత్రం కాంప్రమైజ్ కాకపోవడమే కాదు.. అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. అలా తొమ్మిది మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఇంటి నిండా భార్యలే. ఒక్క భార్యతోనే వేగలేమని, ఇద్దరుంటే మట్టిగొట్టుకుపోవుడేనని పెద్దల ఉవాచ. కానీ, ఆ బ్రెజిల్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో మాత్రం సాహసం చేశాడు. తొమ్మిది మందిని మనువాడాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారందరినీ సమానంగా చూడాలనుకున్నాడు. అందరితోనూ సమానంగా కాలాన్ని గడపాలనుకున్నాడు. అందరినీ అన్ని రకాలుగా సంతృప్తి పరచాలనుకున్నాడు.

అందరినీ లైంగికంగానూ సమంగా చూసుకోవాలనుకున్నాడు. కాబట్టి, ఆయన సంభోగం కోసం ప్రత్యేకంగా ఓ టైం టేబుల్ పెట్టుకున్నాడు. ఒక్కో భార్య కోసం ఒక్కో సమయాన్ని కేటాయించాడు. ఆ టైం టేబుల్ ప్రకారమే వారితో కలుసుకోవడం ప్రారంభించాడు.

కానీ, కొన్నాళ్లకు ఆ వ్యవహారం అంతా కృత్రిమంగా తోచింది. మనసుకు నచ్చినప్పుడు.. ఇద్దరిలోనూ కలుసుకోవడానికి సానుకూల వాతావరణం, పరిస్థితులు రావడం పక్కనపెట్టి మరీ యంత్రాల్లా టైం టేబుల్‌ను ఫాలో కావడం మొదలు పెట్టారు. కొన్నాళ్లకు అదంతా వెగటుగా కనిపించింది. అందుకే ఆయన తన విషయంలో సెక్స్ రోస్టర్ పని చేయలేదని అన్నాడు. శారీరకంగా కలవడానికి టైం టేబుల్ పెట్టుకునే విధానం సక్సెస్ కాలేదని పేర్కొన్నాడు. లైంగిక వాంఛకూ టైం టేబుల్ పెట్టడం వెర్రితనమేనని అభిప్రాయపడ్డాడు.

ఆ షెడ్యూల్ చూసుకున్నప్పుడల్లా.. అయ్యో తాను ఇప్పుడు ఎదురుగా ఉన్న ఆ భార్యతో సంభోగం చేయాల్సిందినని, అదీ తన సంతోషం, సుఖం కోసం కాకుండా కేవలం షెడ్యూల్ కోసమే భౌతికంగా కలుసుకోవాల్సిందేననే స్థాయికి ఆలోచనలు వెళ్లాయని ఆ మోడల్ పేర్కొన్నాడు. ఈ షెడ్యూల్ ఒత్తిడితోపాటు అనేక సమస్యలను తెచ్చిపెట్టిందని వివరించాడు. ఒక్కోసారి తాను ఎదురుగా ఉన్న భార్యతో గడుపుతూనే మరో భార్య గురించి ఆలోచించేవాడినని పేర్కొన్నాడు. అసలు ఇదంతా సరైన పద్ధతి కాదని అందరమూ ఒక అభిప్రాయానికి వచ్చామని తెలిపాడు. అందుకే ఇప్పుడు వారంతా ఆ టైం టేబుల్ తీసేసారని, సహజంగా ఎప్పుడు ఉద్దీపన కలిగినా అప్పుడే శారీరకంగా కలవడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పాడు.

ఫ్రీ లవ్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పే ఆ మోడల్.. ఏకపత్నిని కలిగి ఉండే విధానాన్ని నిరసిస్తుంటాడు. అందుకే ఎనిమిది మంది భార్యలు ఉన్నప్పటికీ గతేడాది తొమ్మిది భార్యను పెళ్లి చేసుకున్నాడు. 

ఇటీవలే ఆయన ఓ భార్య నుంచి డైవర్స్ ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. తన భర్త పూర్తిగా తనకే సొంతం కావాలని భావించిందని, కానీ, అది కుదరకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే