నాతో పడుకో.. లేదంటే మరో 20 మందిని తెస్తా.. : టీనేజీ అమ్మాయిపై రష్యా సైనికుడు ఘాతుకం

Published : Apr 28, 2022, 12:59 PM IST
నాతో పడుకో.. లేదంటే మరో 20 మందిని తెస్తా.. : టీనేజీ అమ్మాయిపై రష్యా సైనికుడు ఘాతుకం

సారాంశం

ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు దురాగతాలకు పాల్పడుతున్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా, ఖెర్సాన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరు నెలల గర్భం దాల్చిన ఓ 16 ఏళ్ల టీనేజర్‌పై రష్యా సైనికుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి జరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలో పలు ఉక్రెయిన్ గ్రామాలను రష్యా జవాన్లు తమ గుప్పిట్లోకి తెచ్చారు. ఈ గ్రామాల్లో రష్యా సైనికుల దురాగతాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రష్యా అధీనంలోని ఖెర్సాన్ పరిధిలోని గ్రామంలో రష్యా సైనికులు మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది.

‘ఇప్పుడు నాతో పడుకో.. లేదంటావా.. మరో 20 మంది పురుషులను తీసుకువస్తా’.. అని ఓ రష్యా సైనికుడు గర్భం దాల్చిన టీనేజీ బాలికపై తన ప్రతాపం చూపాడు. 16 ఏళ్ల ఆ బాలిక నిస్సహాయతను అదునుగా తీసుకుని అకృత్యానికి పాల్పడ్డాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ బాలిక ఆరు నెలల గర్భిణి.

రష్యా సైనికుల బాంబుల నుంచి రక్షణ పొందడానికి ఖెర్సాన్ పరిధిలోని ఓ గ్రామంలో కుటుంబం వారి నివాసం బేస్‌మెంట్‌లో నివసిస్తున్నది. ఓ రోజు సాయంత్రం ఆకలి కావడంతో తినడానికి బయటకు వచ్చారు. అది సంధ్యా సమయం. అప్పుడు తప్పతాగి ఉన్న ఓ రష్యా సైనికుడు ఆ కుటుంబాన్ని చూశాడు. వెంటనే వారిని అడ్డుకున్నాడు. అప్పుడు తల్లితోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్ల వయసు 12 ఏళ్లు, 14 ఏళ్లు, 16 ఏళ్లు. వారందరినీ అటకాయించాడు.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం, ‘తప్పతాగి ఉన్న ఆ రష్యా సైనికుడు ముందు పిల్లల వయసు ఎంత అని అడిగాడు. అప్పుడు 12ఏళ్ల బాలిక, 14 ఏళ్ల బాలికతోపాటు 16 ఏళ్ల నేను కూడా ఉన్నాను. దీంతో ఆయన మొదట మా తల్లిపై కన్నేశాడు. కానీ, త్వరగానే ఆమెను వదిలిపెట్టాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు. అతను నా దగ్గరకు రాగానే నేను భయంతో కేకలు వేశాను. నా దుస్తులు తొలగించాలని ఆదేశించాడు. నా అరుపులు మరింత బిగ్గరయ్యాయి. దుస్తులు తొలగించడానికి నేను నిరాకరించాను. అప్పుడు అతను తనతో పడుకోవాలని లేదంటే మరో 20 మంది పురుషులను ఇప్పుడే తీసుకువస్తానని బెదిరించాడు.’ అని వాపోయింది.

తాను రేప్‌ చేయకుండా అడ్డుకుంటే గొంతు నులిమేస్తానని, చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పింది. అయితే, అక్కడే మరో రష్యా సైనికుడు ఉన్నాడు. ఆయన తాగి లేడు. అతను ఆ రాక్షసుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ ప్రయత్నం వృథా అయిందని ఆమె వివరించింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే