Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లలో ఉండగా, మరికొంత మంది ఆ దేశాన్ని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వేల కీలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించిన ఓ బాలుడు సురక్షితంగా స్లోవేకియా చేరుకున్నాడు.
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రష్యాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ దేశ బలగాలు సాధారణ పౌర ప్రాంతాలపై కూడా మిస్సైల్స్ తో విరుకుపడుతున్నాయి. దీంతో ప్రాణాలు కోల్పోతున్న సాధారణ పౌరుల సంఖ్య పెరుగుతోంది. యద్ధం నేపథ్యంలో ప్రాణాలు నిలుపుకోవడానికి అక్కడి ప్రజలు బంకర్లలోనే నివాసం ఉంటున్నారు. మరికొంత మంది సరిహద్దు దేశాలకు వలస వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ వార్ జోన్ నుంచి ఏకంగా వేల కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించిన ఓ బాలుడు.. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సరిహద్దు దేశానికి చేరుకున్నారు. యుద్ధభూమి నుంచి ఓంటరిగానే వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించిన ఆ బాలుడి సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ తో పాటు స్లోవేకియా దేశాల అధికారులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి. వివరాల్లోకెళ్తే.. దక్షిణ-తూర్పు ఉక్రెయిన్‌లోని జపోరోజీ అనే నగరానికి చెందిన 11 ఏళ్ల ఉక్రేనియన్ బాలుడు తన పశ్చిమ పొరుగున ఉన్న స్లోవేకియాకు వేల కీలోమీటర్లు ఒంటరిగానే ప్రయాణం సాగించి తనంతట తానుగా చేరుకున్నాడు.
undefined
ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఆ పిల్లవాడు పెద్దలు తోడు లేకుండానే ఒంటరిగా స్లోవేకియాకు చేరుకున్నాడనీ, ప్రస్తుతం ఆ బాలుడు బాగానే ఉన్నాడని పేర్కొంది. "అతను తన చిరునవ్వు, నిర్భయత మరియు నిజమైన హీరో సంకల్పంతో అందరి మనసు గెలుచుకున్నాడు" అని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకు ముందు బాలుడు స్వయంగా సరిహద్దుకు వెళుతున్నాడని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎందుకంటే అతని తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో ఉండవలసి పరిస్థితులు ఉనన్నాయని పేర్కొంది.
ఆ బాలుడు దాదాపు 1400 కిలో మీటర్లు ఒంటరిగా ప్రయాణించి స్లోవేకియాకు చేరుకున్నాడు. స్లోవేకియా మంత్రిత్వ శాఖ కూడా బాలుడు సురక్షితంగా ఆ దేశానికి చేరుకున్న విషయాన్ని వెల్లడించింది. అతని ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బాలుడు చేతికి ప్లాస్టిక్ బ్యాగ్, పాస్‌పోర్టు, ఫోన్ నంబర్ రాసుకుని స్లోవేకియా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. స్లోవేకియా చేరుకున్న ఆ బాలుడికి అక్కడి వాలంటీర్లు తినడానికి ఆహారం, నీళ్లు అందిస్తూ.. జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ బాలుడు అతని తల్లి రాసిన లెటర్ ను తీసుకురావడంతో అధికారులు వారి బంధువులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే వారు ఆ బాలుడిని తీసుకెళ్లడానికి వచ్చారు అని తెలిపారు.
ఇదిలావుండగా, యుద్ధం కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 10 రోజుల వ్యవధిలో ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రాంతాల నుంచి 1.5 మిలియన్ల మంది ఇతర దేశాలకు వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ మార్చి 6న వెల్లడించింది. ఉక్రెయిన్ నుండి పోలాండ్ అత్యధిక సంఖ్యలో శరణార్థులు వచ్చారు. మొత్తం 1,735,068 మంది పౌరులు ఉండగా, వారిలో ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు ఉన్నారు.
10 days.
1.5 million people.
This is now the fastest growing refugee crisis since World War II.
In the coming days millions more lives will be uprooted, unless there is an immediate end to this senseless conflict. pic.twitter.com/OmEcGeMRtS