అగ్నిప్రమాదం... కుమారుడిని కిటికీలో నుంచి తోసేసిన తండ్రి..!

Published : Mar 14, 2022, 10:56 AM IST
అగ్నిప్రమాదం... కుమారుడిని కిటికీలో నుంచి తోసేసిన తండ్రి..!

సారాంశం

కాగా... అధికారులు ఆ భవనం దగ్గర చేతులు చాచి భవనం కింద నిలబడి ఉన్నారు. కాగా.. అధికారులు రెండవ అంతస్తులో చిక్కుకున్న వ్యక్తిని అతని మూడేళ్ల బాబును  కిందకు విసిరేందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓ వ్యక్తి తన కన్న కొడుకును కిటికీలో నుంచి కిందకు తోసేశాడు. అయితే.. కొడుకుకు హాని చేయాలి అనే ఉద్దేశంతో కాదు.. తన కొడుకు ప్రాణాలు కాపాడటానికి కిందకు విసిరేశాడు. తాము ఉంటున్న భవనానికి అగ్నిప్రమాదం జరగడంతో.. ఆ మంటల్లో కొడుక్కి ఏమీ కాకుండా ఉండేందుకు కిందకు విసిరేశాడు. ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూ జెర్సీలో చోటుచేసుకోగా...ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సౌత్ బ్రున్స్‌విక్ టౌన్‌షిప్ పోలీస్ డిపార్ట్‌మెంట్  పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ షేర్ చేసిన ఫుటేజీలో కనపడింది. ఓ కుటుంబం నివసిస్తున్న భవవానికి మంటలు అలుముకున్నాయి. ఆ మంటలను చూసి.. అక్కడి వారంతా భయాందోళనలకు గురవ్వడం ఆ వీడియోలో కనపడుతోంది. కాగా... అధికారులు ఆ భవనం దగ్గర చేతులు చాచి భవనం కింద నిలబడి ఉన్నారు. కాగా.. అధికారులు రెండవ అంతస్తులో చిక్కుకున్న వ్యక్తిని అతని మూడేళ్ల బాబును  కిందకు విసిరేందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

"బిడ్డను కిందకు పంపించండి" అని అధికారులు అరవడం వీడియోలో స్పష్టంగా వినపడుతోంది. కాగా.. ఆ తర్వాత.. సదరు వ్యక్తి.. తన కుమారుడిని కిటికీలో నుంచి.. బాలుడిని కిందకు విసిరేశాడు. గత వారం ఈ సంఘటన చోటుచేసుకోగా.. వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో 7,500  వ్యూస్ రావడం గమనార్హం. చాలా మంది నెటిజన్లు..  అధికారుల రెస్క్యూ ప్రయత్నాలను ప్రశంసించారు.  అధికారులు సమయానికి వచ్చి.. వారిని కాపాడటం చాలా సంతోషంగా ఉందని నెటిజన్లు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం