కెనడాలో వింత వ్యాధి.. పసుపు పచ్చగా మారిన బాలుడి నాలుక, కారణమిదేనన్న వైద్యులు

Siva Kodati |  
Published : Jul 25, 2021, 09:09 PM ISTUpdated : Jul 25, 2021, 09:45 PM IST
కెనడాలో వింత వ్యాధి.. పసుపు పచ్చగా మారిన బాలుడి నాలుక, కారణమిదేనన్న వైద్యులు

సారాంశం

కెనడాలో 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అని వైద్యులు పేర్కొంటున్నారు. అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు చెబుతున్నారు.

కరోనా వైరస్‌తో భూగోళం అల్లాడుతున్న వేళ.. కొత్త కొత్త వేరియంట్‌లు, వ్యాధులు ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. తాజాగా కెనడాలో మరో కొత్త వైరస్ వెలుగుచూసింది. ఓ 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు చెబుతున్నారు. ‘‘ ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌ ’’లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత బాలుడుకి రక్తహీనత ఉందని, ఎప్సీన్‌ బార్ వైరస్ బారిన పడినట్లు డాక్టర్లు గుర్తించారు.

కాగా యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుందని తెలిపారు. అయితే బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..