భూమికి మరో ముప్పు.. దూసుకొస్తున్న భారీ అస్టరాయిడ్

By Siva KodatiFirst Published Jul 22, 2021, 7:45 PM IST
Highlights

జూలై 24వ తేదిన అంతరిక్షంలో నుంచి స్టేడియం పరిమాణంలో వున్న అతిపెద్ద ఆస్టరాయిడ్ భూమి మీదకు రాబోతోందని చైనా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. దాని పేరు 2008 GO20. 


కొద్దిరోజుల క్రితం భూమిపైకి భారీ సౌర తుఫాను ముంచుకొచ్చింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపించినా ఆ తర్వాత ఆ ముప్పు తొలగిపోయింది. దీని  నుంచి ఊపిరి పీల్చుకున్న తర్వాత తాజాగా మరో ముప్పు ముంచుకొస్తోంది. జూలై 24వ తేదిన అంతరిక్షంలో నుంచి స్టేడియం పరిమాణంలో వున్న అతిపెద్ద ఆస్టరాయిడ్ భూమి మీదకు రాబోతోందని చైనా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. దాని పేరు 2008 GO20. 

ఈ భారీ ఆస్టరాయిడ్ గంటకు 18 వేల మైళ్ల వేగంతో భూమి మీదకు రాబోతున్నట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ ఆస్టరాయిడ్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాసా చెబుతోంది. 

4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి రాతి అవశేషాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.ఇప్పుడు విశ్వంలో 1,097,106 గ్రహశకలాలు ఉన్నట్లు అంచనా. ఉల్కల కంటే చాలా భిన్నంగా ఈ గ్రహశకలాలు అనేవి ఉంటాయని వారు తెలిపారు. ఈ అస్టరాయిడ్ నుంచి భూమిని రక్షించేందుకు గాను చైనా పరిశోధకులు భారీ రాకెట్లను పంపనున్నట్లుగా తెలుస్తోంది. 

click me!