రూ.32 తో కొన్న పుస్తకం...రూ.11లక్షలకు అమ్ముడుపోయింది..!

Published : Jul 14, 2023, 11:13 AM IST
  రూ.32 తో కొన్న పుస్తకం...రూ.11లక్షలకు అమ్ముడుపోయింది..!

సారాంశం

హ్యారీ పోటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ అనే అరుదైన మొదటి ఎడిషన్ రిచర్డ్ వింటర్ టన్ వేలం నిర్వహించారు. ఈ పుస్తకం వేలంలో దాదాపు రూ.11లక్షలకు అమ్ముడుపోవడం విశేషం.  

హ్యారీ పోటర్ తెలియని వారు ఎవరూ ఉండరేమో. ఇదొక కల్పిత కథ అయినప్పటికీ, ఈ సిరిస్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈసిరిస్ సినిమాగా వచ్చినా, పుస్తకంగా వచ్చినా ఎగబడి చూశారు. అయితే, తాజాగా ఈ సిరీస్ కి సంబంధించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ హ్యారీ పోటర్  కథలను అందించిన రచయిత జేకే రౌలింగ్ అందించారు.

అయితే, అసలు విషయానికి వస్తే, హ్యారీ పోటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ అనే అరుదైన మొదటి ఎడిషన్ రిచర్డ్ వింటర్ టన్ వేలం నిర్వహించారు. ఈ పుస్తకం వేలంలో దాదాపు రూ.11లక్షలకు అమ్ముడుపోవడం విశేషం.

 

లామినేటెడ్ బోర్డ్ కవర్‌తో 1997లో బ్లూమ్స్‌బరీ ప్రచురించిన ఈ పుస్తకం కేవలం 500 మొదటి ఎడిషన్ ఫస్ట్ ఇంప్రెషన్‌లలో ఇది కూడా  ఒకటి  కావడం విశేషం వాటిలో 300 పుస్తకాలను  లైబ్రరీలకు పంపించగా, దానిలో ఒక దానిని వేలం వేశారు. ఇది మొదటి కాపీ కావడంతో అందరూ ఎగబడి వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. నిజానికి ఈ పుస్తకం ప్రింట్ సమయంలో దాని ధర రూ.32 కాగా,  ఇప్పడు రూ.11లక్షలకు అమ్ముడు కావడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఈ ఫలితం తమకు సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే